హోటళ్లకు వెలుతున్నారా .. జర భద్రం... మీ శృంగార వీడియోలు ఆన్ లైన్ లో ప్రత్యేక్షం అవ్వొచ్చు!
సియోల్/ హైదరాబాద్ : హోటల్ గదుల్లో సురక్షితంగా ఉండొచ్చు అనుకునే కొత్త జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. గదిలో దూరాము కాదా ఇక మనల్ని ఎవరు చూస్తారు అనుకుంటే బొక్కబార్లా పడ్డట్టే..! గదిలో దూరి తలుపేసుకుంటే ఇక మిమ్మల్ని, మీ శ్రుంగార జీవితాన్ని ప్రపంచం చూస్తున్నట్టే లెక్క. అదే ఆ హోటల్ గొప్పతనం. గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాక ప్రపంచం చూడడమేమిటి అనుకుంటున్నారా..? ఐతే ఇది చదవండి.
హోటళ్లలో గదులు తీసుకొనే జంటలను ఓ ముఠా టార్గెట్ చేసుకుంది. వారి మధ్య జరిగే శృంగార కార్యకలాపాలను గుట్టుగా వీడియోలు తీసింది. దీనికోసం మిల్లీమీటరు మందంతో ఉన్న కెమెరాలను ఎవరికీ అనుమానం రాని రీతిలో టీవీ బాక్స్‌ల్లో, వాల్ సాకెట్లలో, హెయిర్ డ్రయ్యర్ హోల్డర్లలో అమర్చింది. ఆ వీడియోలను అన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ముఠా సభ్యులు భారీమొత్తంలో డబ్బులు సంపాదించిన వ్యవహారం దక్షిణ కొరియాలో వెలుగు చూసింది.

గతేడాది నవంబరు నుంచి ఈ తంతు సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల్లో 800కు పైగా జంటలు ఉన్నట్లు వారు చెబుతున్నా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందంటున్నారు. దేశంలోని పది నగరాల్లో ఉన్న 30వేర్వేరు హోటళ్లలోని 40గదుల్లో ఈ కెమెరాలను అమర్చినట్లు గుర్తించారు.వాటి సాయంతో గెస్ట్‌ల వీడియోలను రహస్యంగా రికార్డు చేశారు. నాలుగు వేల మందికి పైగా సభ్యులు ఉన్న ఓ వెబ్‌సైట్ వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసింది.
వాటిని చూడటానికి సైట్ యాజమాన్యం సభ్యుల నుంచి భారీమొత్తం వసూలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, దక్షిణ కొరియాలోని మోటెల్స్‌లో తక్కువ ధరకే గదులు లభిస్తుండటంతో విదేశీయులతో పాటు పలువురు స్థానికులు కూడా వీటిలో దిగడానికి ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రైవసీ కోరుకొనే యువతీ, యువకులు ఎక్కువగా ఇక్కడికే వస్తారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఈ ముఠా గదుల్లో రహస్య కెమెరాలు అమర్చింది. తమ దేశంలో రహస్య కెమెరాలను గుర్తించడం మొదటిసారేమీ కాదని, అయితే వాటిని ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం మాత్రం ఇదే తొలిసారని పోలీసులు చెప్పకు రావడం విశేషం..!!
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications