సిడ్నీలో బెంగళూరు టెక్కీ హత్య: జాతి వివక్ష లింక్ లేదని.. (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో హత్యకు గురైన బెంగళూరు మహిళా ఐటీ కన్సల్టెంట్ కేసులో ఎలాంటి జాతిపరమైన లింక్స్ కనిపించడం లేదని ఆస్ట్రేలియా పోలీసులు సోమవారం చెప్పారు. ఇది యాధృచ్ఛికంగా జరిగింది కావొచ్చునని చెప్పారు. అయితే, దీని పైన తాము అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చెప్పారు.

కాగా, ఆస్ట్రేలియాలో భారత మహిళ ఐటీ కన్సల్టెంట్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. సిడ్నీ శివారులోని వెస్ట్ మీడ్ పారామట్టా పార్కులో శనివారం రాత్రి తొమ్మిన్నర గంటల ప్రాంతంలో బెంగళూరుకు చెందిన ప్రభా అరుణ్ కుమార్‌(40)ను గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు.

పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై పారామట్టా పోలీస్ అధికారి వేన్ కాక్స్ మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా తమకు తెలియజేసి కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన

వివరాల్లోకి వెళితే... ఆఫీసు విధులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె మేనల్లుడు త్రిజేష్ తెలిపారు. ఆమె ఇంటికి 300 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన

ఆమె బెంగుళూరులోని తన భర్త అరుణ్‌తో ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తుండగా దుండగుడు తనను వెంబడిస్తున్నాడని చెప్పిందని తెలిపారు.

సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన

'నన్ను వెళ్లనివ్వండి, కావాలంటే నా బ్యాగ్ తీసుకోండి, ఇంకా ఏమి కావాలన్నా ఇస్తాను' అని చెప్పడంతో పాటు 'వాడు నన్ను కత్తితో పొడిచాడు డార్లింగ్' అని తన భర్తకు చెప్పిందని ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు చెప్పారు. ప్రభా అరుణ్‌కుమార్‌కు భర్త, తొమ్మిది సంవత్సరాలు కూతురు ఉన్నారు.

 సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన

సిడ్నీలోని భారత కాన్సులేట్ జనరల్ వెంటనే అప్రమత్తమయ్యారని, ఘటనపై తగిన చర్యలు తీసుకుంటున్నారని విదేశాంగ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రభా అరుణ్‌కుమార్‌ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న భర్త అరుణ్ ఆస్టేలియాకు బయలుదేరి వెళ్లారు.

సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన పైన భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం మాట్లాడుతూ.. హత్య విషయం తెలిసి తాను తీవ్ర ఆందోళనకు లోనయ్యానని చెప్పారు. సిడ్నీలోని ఇండియన్ కాన్సులేట్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు చెప్పారు.

 సిడ్నీ ఘటన

సిడ్నీ ఘటన

కాగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. మృతి చెందిన ప్రభ పారామట్ట స్టేషన్ నుండి నడుచుకుంటూ వస్తుండగా ఆమెను పొడిచి చంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+