పోలీస్‌స్టేషన్‌లో బర్త్‌డే సంబురాలు: ముంబై పోలీసులపై ప్రశంసలు

ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడికి అనుకోని సర్‌ప్రైజ్‌ ఎదురైంది.ఫిర్యాదు చేయడానికి సకినక పోలీస్ స్టేషన్‌కు వచ్చిన అనీష్ అనే యువకుడి బర్త్‌డే అని తెలుసుకొని కేక్ కట్ చేసి శుభాకాం

ముంబై: ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడికి అనుకోని సర్‌ప్రైజ్‌ ఎదురైంది. పుట్టినరోజని తెలుసుకున్న పోలీసులు స్టేషన్‌లోనే కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.

ముంబయికి చెందిన అనీశ్‌ అనే యువకుడు శనివారం ఫిర్యాదు చేయడానికి స్థానిక సకినక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కంప్లైంట్‌ రాస్తూ తన వివరాలన్నీ పేర్కొన్నాడు. అక్కడి ఎస్సై అనీశ్‌ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్‌ తెగ భయపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అంతా కలిసి అనీశ్‌కు కేక్‌ తెప్పించి సర్‌ప్రైజ్‌ చేశారు.

He Went To File An FIR. Mumbai Police Surprised Him With A Cake

అదే స్టేషన్‌లో అనీశ్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ ఫొటోలను ముంబయి పోలీసులు అధికారిక ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పెట్టిన కొద్దిసేపటికే 1000కిపైగా లైక్‌లు 200లకు పైగా రీట్వీట్లు వచ్చాయి. పోలీసులు ఇలా స్నేహపూర్వకంగా ఉంటే ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు.

తొలుత భయపడిన అనీశ్... పోలీసులు తన బర్త్‌డే వేడుకలను నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల తీరులో మార్పు వచ్చిందని ఈ ఘటన తెలుపుతోందని నెటిజన్లు ముంబై పోలీసులను మెచ్చుకొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+