వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశా నిరోద్ లపై తిరగబడ్డ ఆశా వర్కర్స్..! దిగొచ్చిన ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్ : డీలక్స్ నిరోద్ పేరిట ఉన్న కండోమ్ లను ఆశా కండోమ్స్ గా పేరు మార్చడంపై ఉత్తరాఖండ్ ఆశా వర్కర్లు (అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) నిరసన గళం వినిపిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తమను అవమానించే చర్య అని పేర్కొంటూ రాష్ట్ర ఆశా వర్కర్స్ అందరు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు.

రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేసే ఈ కండోమ్స్ కు తమ సంస్థ పేరును పెట్టడాన్ని తప్పుబడుతున్నారు అక్కడి ఆశా వర్కర్స్. ఇప్పటికే వేల సంఖ్యలో ఆశా కండోమ్స్ పేరిట ప్రభుత్వం అన్ని ఆరోగ్య కేంద్రాలకు నిరోద్ లను పంపిణీ చేయడంతో.. ఇది తమను అవమానించడమే అంటున్నారు.

Health Activist Workers Protest Against 'ASHA Condoms' in Uttarakhand

ఎంతో చొరవతో నిజాయితీగా పనిచేసే ఆశా వర్కర్లను ప్రభుత్వం ఇలా ఇబ్బందులు పాలు చేయడం సరైంది కాదంటున్నారు రాష్ట్ర ఆశా వర్కర్ల అధ్యక్షురాలు శివ దూబే. ఆశా వర్కర్లకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు ముందుకురాని ప్రభుత్వం..ఇలా అవమానించడం దారుణమంటూ ఆందోళన చేస్తున్నారు. కాగా, ఆశావర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆశా నిరోద్ ల పేరిట చేపట్టిన నిరోద్ ల పంపిణీని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

English summary
Uttarakhand chief minister Harish Rawat has directed health department to stop with immediate effect distribution of condoms by the accredited health workers or ASHA (Accredited Social Health Activist) workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X