అవసరం కానీ: సెక్స్ఎడ్యుకెషన్‌పై కేంద్రమంత్రి యూటర్న్

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సెక్స్ ఎడ్యుకేషన్ పైన తాను చేసిన వ్యాఖ్యలను సవరించుకున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమే గానీ, అందులో అసభ్యతకు తావుండరాదని సూచించారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన లైంగిక విద్యలో గ్రాఫిక్స్‌తో కూడిన బొమ్మలు అసభ్యంగా ఉండేవని, దాన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అని పిలవలేమన్నారు.

కాగా, కండోమ్స్ ధరించాలనే ప్రచారం చేయడం కన్నా వైవాహిక జీవితంలోని లైంగిక జీవితాన్ని అనుభవించాలనే ప్రచారం ఎయిడ్స్ నిరోధానికి మంచిదంటూ ప్రకటన చేసి వివాదం సృష్టించిన హర్షవర్ధన్ శుక్రవారం వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాఠశాలల్లో లైంగిక విద్యా బోధనను నిషేధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Health Minister Harsh Vardhan evokes sharp criticism for banning sex education in schools

తన వెబ్‌సైట్‌లో లైంగిక విద్యా బోధనపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో కాల్డ్ సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధించాలని ఆయన త డిఆర్‌హర్షవర్ధన్ డాట్ కామ్‌లో రాశారు. విలువలతో కూడిన విద్యను అందించాలని, భాత సాంస్కృతిక సంప్రదాయాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. హర్షవర్ధన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

ఎయిడ్స్‌ను నిరోధించడానికి కండోమ్స్ ధరించాలనే ప్రచారం మాత్రమే సరిపోదని హర్షవర్ధన్ ఇటీవల అన్నారు. అమెరికా ఆరోగ్య మంత్రి సిల్వియా మాథ్యూస్ బుర్వెల్‌ను కలవడానికి అమెరికాలో ఉన్న డాక్టర్ హర్షవర్ధన్ కండోమ్ ధారణపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

ఎయిడ్స్ నిరోధ ప్రచారానికి కండోమ్ ధారణ ప్రచారంపైనా ఆధారపడ కూడదని, కండోమ్ ధరించినంత వరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధానికైనా పాల్పడవచ్చుననే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+