వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: తన కోపమే తన శత్రువు.. కోపం ఎన్ని రోగాలను, సమస్యలను తెస్తుందంటే!!

|
Google Oneindia TeluguNews

చాలామందికి ప్రతీ చిన్న విషయానికి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. అలా తరచు కోపంతో ఇబ్బంది పడుతున్న వారు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కోపం తగ్గ్గించుకోవాలని కొందరు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. అలాంటి వారు ఆహారంలో కోపాన్ని ప్రేరేపించే ఉప్పు, మసాలాలకు దూరంగా ఉండాలి. ఇక కోపం తగ్గ్గించుకోవటం కోసం ప్రయత్నం చెయ్యాలి, లేదంటే ప్రమాదంలో పడేది వారి ఆరోగ్యమే అంటున్నారు వైద్య నిపుణులు.

health tips: హైబీపీని కంట్రోల్ చెయ్యటానికి మర్చిపోకుండా ఈ ఆహారపదార్ధాలు ట్రై చెయ్యండి!!health tips: హైబీపీని కంట్రోల్ చెయ్యటానికి మర్చిపోకుండా ఈ ఆహారపదార్ధాలు ట్రై చెయ్యండి!!

కోపంతో అనేక అనర్ధాలు .. ఆరోగ్య సమస్యలు

కోపంతో అనేక అనర్ధాలు .. ఆరోగ్య సమస్యలు


తన కోపమే తన శత్రువు అని పదేపదే పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక అలా నిత్యం విపరీతమైన కోపం తో బాధపడుతున్న వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి ఆరోగ్యం ఎంత పాడవుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తరచూ కోప్పడ్డం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయని, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. కోపం ఒక వ్యక్తిని విపరీతమైన చిరాకుకు గురిచేస్తుంది. వారికి విరామం లేకుండా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి, దానివల్ల అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

 కోపంతో బీపీ, గుండె జబ్బులు.. నిద్రలేమి... వచ్చే అనారోగ్యాలివే

కోపంతో బీపీ, గుండె జబ్బులు.. నిద్రలేమి... వచ్చే అనారోగ్యాలివే


కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక విపరీతమైన కోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా రకరకాల సమస్యలు వస్తాయి. కోపం వల్ల పునరుత్పత్తి శక్తి కూడా తగ్గుతుంది. కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. కోపం ఎక్కువగా రావడం వల్ల సమర్ధవంతంగా ఆలోచించలేని పరిస్థితి వస్తుంది. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మనలోని సృజనాత్మకత, ఆనందం రెండూ తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి విపరీతమైన కోపం మనుషుల్ని పక్షవాతం బారిన, బ్రెయిన్ స్ట్రోక్ ల బారిన పడేస్తుంది.

విపరీతమైన కోపం చేసే పనిపై ప్రభావం

విపరీతమైన కోపం చేసే పనిపై ప్రభావం


విపరీతమైన కోపం వల్ల రిలేషన్ షిప్ సమస్యలు వస్తాయి. మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో సంబంధాలు దెబ్బతింటాయి. విపరీతమైన కోపం వల్ల వాదోపవాదాలు జరుగుతాయి. ఫలితంగా మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఉద్యోగాలు చేసే వారిలో, వ్యాపారాలు చేసే వారిలో కోపం అనర్థాలకు కారణం అవుతుంది. పనిచేసే చోట కోపం ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకో లేకపోతే సహచర ఉద్యోగులతో గొడవలు అవుతాయి. అది చేసే పని మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

కోపం వల్ల అనేక దారుణాలు.. ఒక్కోసారి జీవితమే నాశనం

కోపం వల్ల అనేక దారుణాలు.. ఒక్కోసారి జీవితమే నాశనం


కోపం మానసిక సంఘర్షణకు కారణం అవుతుంది. కోపం వల్ల కలిగే ఉద్రేకం బాధను కలిగిస్తుంది. అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక కోపం ఒక్కో సారి దారుణాలకు కారణం అవుతుంది. క్షణికావేశంలో చెయ్యకూడని నేరాలు చేసేలా ప్రేరేపిస్తుంది. కోపం ఒక్కోసారి జీవితాలనే నాశనం చేస్తుంది. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం ఎంతో అవసరం అని పెద్దలు చెప్తారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Anger causes so many health problems and also creates social problems. Anger can lead to high blood pressure, insomnia and heart disease. Hormonal imbalance and immune system decrease.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X