వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: ఏ అనారోగ్యమైనా సరే తగ్గాలంటే.. మందుల కన్నా ముందు కీలకం ఇదే!!

|
Google Oneindia TeluguNews

నిత్యం వందలో ఎనభై మంది వివిధ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ప్రస్తుత సమాజంలో అనారోగ్యం అనేది కామన్ గా మారిపోయింది. చిన్న పిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారు. మనం తినే ఆహారం, జీవనశైలి విధానాల వల్ల రక రకాల అనారోగ్యాలు మనుషుల పైన దాడి చేస్తున్నాయి. ఇక దీర్ఘకాల వ్యాధుల మాట అయితే చెప్పనక్కర్లేదు. బీపీ, డయాబెటిస్, ఆర్థరైటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి.

health tips: చలికాలంలో కీళ్ళనొప్పులు నరకం చూపిస్తున్నాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!!health tips: చలికాలంలో కీళ్ళనొప్పులు నరకం చూపిస్తున్నాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి!!

అనారోగ్యాలకు మందులు వాడే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి

అనారోగ్యాలకు మందులు వాడే ముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి


ఇక అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుల దగ్గరకు వెళ్లి, పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటారు. అయితే ఏ అనారోగ్యమైన సరే మందులు వాడే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఉదాహరణకు బీపీ వంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు సమయానుకూలంగా మందులను వాడడంతో పాటుగా, దాన్ని ఏవిధంగా కంట్రోల్ చేసుకోవాలి. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి. ఎలా ఉంటే బీపీ అదుపులో ఉంటుంది వంటి విషయాలను తెలుసుకోవాలి. వాటిని పాటించటానికి ప్రయత్నించాలి.

మానసిక ఆందోళనతో జబ్బు మరింత పెరుగుతుంది.. అది తగ్గించుకోవాలి

మానసిక ఆందోళనతో జబ్బు మరింత పెరుగుతుంది.. అది తగ్గించుకోవాలి


ఇక అన్నిటికంటే సమస్య ఏది వచ్చినా దానిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉండాలి. ఏదైనా జబ్బు చేసినప్పుడు చాలామంది విపరీతంగా భయపడి పోతుంటారు. తమకు ఏదో జరిగిపోయినట్టు, తామింకా బతకమేమో అన్నట్టు తెగ బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు ముందు ఆ లక్షణాన్ని తగ్గించుకోవాలి. ఏ అనారోగ్య సమస్య ఏదైనా పరిష్కార మార్గం ఉందనేది గుర్తించాలి. ఓ పద్ధతి ప్రకారం ప్రయత్నం చేస్తే ఎంతటి అనారోగ్యమైన తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా విపరీతంగా భయపడడం వల్ల చాలామంది జబ్బుని మరింత పెంచుకుంటారు.

 ఆందోళన చెందకుండా మందులు వాడటం అవసరం

ఆందోళన చెందకుండా మందులు వాడటం అవసరం


లేని పోని ఆందోళనలతో కొత్త కొత్త అనారోగ్య సమస్యలు కూడా సృష్టించుకున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఆందోళన చెందకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మేలు జరుగుతుందని చెబుతున్నారు. అన్నిటికంటే భయాన్ని వదిలి పెట్టాలని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో కొంతమంది వైద్యుని వద్దకు వెళ్లి మందులు తెచ్చుకున్నప్పటికీ, తగ్గుతుందో లేదో అని అపనమ్మకంతో మందులు వాడుతూ ఉంటారు. అలాంటి వారిపై మందులు సరిగ్గా ప్రభావం చూపించవని చెబుతున్నారు.

మందులపై నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో వాడితే ఫలితం ఉంటుంది

మందులపై నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో వాడితే ఫలితం ఉంటుంది


అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తాము తెచ్చుకొని వాడుతున్న మందులు తమకు ప్రభావవంతంగా పని చేస్తాయని నమ్ముతూ మెడిసిన్స్ వేసుకోవాలని సూచిస్తున్నారు. అన్నిటికంటే ముందు ఏ వ్యాధిని అయినా తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసం అతి కీలకమైన అంశమని చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఏమి వచ్చినా తీవ్రంగా బాధపడుతూ, ఆందోళన చెందుతూ ఎన్ని మందులు వాడినా రోగాల నుంచి బయటపడబోమని హెచ్చరిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
To reduce any illness, Know about your illness and be confident, believe the medicines and doctors. this is the key advice before taking medicines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X