సమోసాలు, జిలేబీలపై హెల్త్ వార్నింగ్‌లు కేవలం పుకార్లే!
PIB Fact Check: సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో నకిలీ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఏది నిజమో.. కాదో అని తెలుసుకోకుండానే చాలా మంది షేర్ చేస్తూనే ఉంటారు. వాటి కారణంగా చాలా మంది అయోమయంలో పడిపోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు స్పందించి ఫేక్ వార్తలను ఖండించి నిజాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇటీవల సమోసాలు, జిలేబీలు, లడ్డూల వంటి భారతీయ స్నాక్స్ ఐటమ్స్ పైనా చట్టబద్ధమైన హెచ్చరికను ప్రచురించాలని జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. స్నాక్స్ విక్రేతలు హెచ్చరిక లేబుళ్లను ఉంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదని ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) మంగళవారం వెల్లడించింది. సమోసాలు, జిలేబీలు, లడ్డూల వంటి స్నాక్స్‌పై ఎలాంటి ఆరోగ్య హెచ్చరికలు లేవని.. అవన్నీ తప్పుడు వాదనలు అని పీఐబీ స్పష్టం చేసింది.
పీఐబీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాలో విక్రేతలు విక్రయించే ఆహార ఉత్పత్తులపై ఎటువంటి హెచ్చరిక లేబుల్‌లు లేవు. మంత్రిత్వ శాఖ భారతీయ స్నాక్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. కొన్ని మీడియా నివేదికలు సమోసాలు, జిలేబిలు, లడ్డూ వంటి ఆహార ఉత్పత్తులపై ఆరోగ్య హెచ్చరికను జారీ చేసిందని పేర్కొన్నాయి. అవి తప్పుడు వాదనలు." అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) పేర్కొంది.ఈ ప్రకటన ద్వారా భారతీయ సంప్రదాయ స్నాక్స్, తీపి వస్తువుల వినియోగంపై తప్పుడు ప్రచారాన్ని పీఐబీ ఖండించింది.

ఇటీవల కొన్ని మీడియా నివేదికలలో భారతీయ స్నాక్స్ ప్యాకెట్లపై.. సిగరెట్ ప్యాకెట్లపై ఎలా అయితే చట్టబద్ధమైన హెచ్చరికను ముద్రిస్తోన్నారో.. అలాంటి వార్నింగ్ నే ఇక వీటి అమ్మకాలపైనా ప్రదర్శించాలని పేర్కొన్నాయి. అవన్నీ పుకార్లేనని.. అలాంటివేం నమ్మవద్దని కేంద్రం పేర్కొంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి విషయాలను నమ్మడానికి, షేర్ చేయడానికి ముందు అధికారిక వర్గాల నుంచి నిజనిజాలు సరిచూసుకోవాలని పేర్కొంది.
Some media reports claim that the @MoHFW_INDIA has issued a health warning on food products such as samosas, jalebi, and laddoo.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 15, 2025
✅This claim is #fake
✅The advisory of the Union Health Ministry does not carry any warning labels on food products sold by vendors,… pic.twitter.com/brZBGeAgzs
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications