స్ట్రెచర్‌పై భార్య, చేతిలో పసిగుడ్డు: జవాన్ అంత్యక్రియల్లో గుండెలు పిండేసే దృశ్యం! (వీడియో)
మహారాష్ట్రలో అత్యంత హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. పుట్టబోయే బిడ్డను చూడాలన్న ఆశతో సెలవుపై వచ్చిన ఓ సైనికుడు, ఆ బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సతారా జిల్లా పర్లీ ప్రాంతానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ప్రమోద్ జాదవ్, తన భార్య ప్రసవం కోసం కొన్ని రోజుల క్రితమే పితృత్వ సెలవుపై ఇంటికి వచ్చారు. త్వరలో తండ్రి కాబోతున్నాననే సంతోషంలో ఉన్న ఆయనను విధి వెక్కిరించింది
ఏం జరిగింది?
ప్రమోద్ భార్య ప్రసవం కోసం స్థానిక ఆసుపత్రిలో చేరారు. ఆమెను చూడటానికి వెళ్తున్న సమయంలో ప్రమోద్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి మరణించారు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, ప్రమోద్ మరణించిన 8 గంటల తర్వాత ఆయన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి మొహం చూడకుండానే ఆ చిన్నారి అనాథగా మారింది.

కన్నీరు మున్నీరు చేసిన అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో ప్రమోద్ జాదవ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన దృశ్యాలు చూసేవారి గుండెలు పిండేశాయి. ప్రసవం జరిగి కొన్ని గంటలే కావడంతో కదలలేని స్థితిలో ఉన్న ప్రమోద్ భార్యను, ఆసుపత్రి నుంచి స్ట్రెచర్‌పై అంత్యక్రియల వద్దకు తీసుకువచ్చారు. తన భర్త భౌతికకాయాన్ని చూస్తూ ఆమె రోదించిన తీరు, అప్పుడే పుట్టిన పసిగుడ్డును తండ్రికి చివరిసారిగా చూపించిన దృశ్యం చూసి ఊరు ఊరంతా కన్నీరు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Heartbreaking tragedy: Army soldier dies in road accident while going for wife's delivery in Satara.
— The Tatva (@thetatvaindia) January 11, 2026
The newborn bid farewell to her father, while her mother was brought on a stretcher to see him before his last rites. pic.twitter.com/VxDVdRurOf
గ్రామంలో విషాద ఛాయలు
దేశాన్ని కాపాడే సైనికుడిని, తమ కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో పర్లీ ప్రాంతం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో ఆశలతో వచ్చిన జవాన్, ఆ బిడ్డను చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలిచివేసింది.












Click it and Unblock the Notifications