Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వయానాడ్ కకావికలం: మట్టిలో కూరుకుపోయిన నివాసాలు: ప్రధానికి రాహుల్ గాంధీ ఫోన్!

Recommended Video

    వయనాడ్ వరదలపై ప్రధానికి రాహుల్ గాంధీ ఫోన్ || Heavy Rain Distract Kerala As Land Slide In wayanad

    తిరువనంతపురం: రెండురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు కేరళలోని వయానాడ్ జిల్లా కకావికలమౌతోంది.70 శాతం మేర తేయాకు తోటలు, కొండలతో నిండివున్న ఈ జిల్లాలో 48 గంటలుగ ఎడతెరినివ్వకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాల్లో కొండ చరియలు, మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. జిల్లాలోని మెప్పాడి సమీపంలో పుతుమల తేయాకు తోటల వద్ద తాజాగా మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. తేయాకు తోటల్లో పనిచేసే కార్మికుల నివాసాలు బురదలో కూరుకుపోయాయి. సుమారు 150 మంది వరకు ఈ బురదలో కూరుకుని పోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

    సమాచారం అందిన వెంటనే జిల్లా పాలన, పోలీసు యంత్రాంగం జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను రంగంలోకి దించింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు హెలికాప్టర్ల ద్వారా 100 మందిని కాపాడారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వయానాడ్ లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రధాని రాహుల్ గాంధీకి ఫోన్ చేశారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో నెలకొన్న దుస్థితిని ఆయనకు వివరించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

    Heavy Rain distract Kerala as land slide in wayanad and red alert in four districts

    వయానాడ్ జిల్లాలో మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. చాలాచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆఱ్ ఎఫ్ బలగాలు హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరదల బారిన పడి 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారు. జిల్లా వ్యాప్తంగా 315 సహాయ, పునరావాస శిబిరాలను నెలకొల్పారు. వయానడ్ తో పాటు ఇడుక్కి, మళప్పురం, కోజికోడ్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కన్నూర్, ఇరిట్టి, కల్పెట్ట, థమరస్సెరిలల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.

    Heavy Rain distract Kerala as land slide in wayanad and red alert in four districts

    ఈ సమాచారం అందిన వెంటనే రాహుల్ గాంధీ వయనాడ్ కు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నానికి ఆయన వయానాడ్ చేరుకుంటారు. తన లోక్ సభ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న భయానక దుస్థితిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ.. ఈ ఉదయం ప్రధానికి ఫోన్ చేశారు.

    Heavy Rain distract Kerala as land slide in wayanad and red alert in four districts

    తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. వయానాడ్ తో పాటు కేరళలోని 12 జిల్లాలు వరదపోటుకు గురైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వరద సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. సహాయ, పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని, భారీ సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ బలగాను మోహరింపజేయాలని కోరారు. నిర్వాసితులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రకటించాలిని రాహుల్ గాంధీ కేరళ ప్రభుత్వాన్ని కోరారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+