ఎప్పుడూ చూడలేదే!: బెంగళూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం(వీడియో)

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వేగంగా వీచిన ఈదురుగాలులకు బీటీఎం లేఅవుట్‌లో పలు చెట్లు కూలిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

Recommended Video

    Watch Citizens Post Videos Of Heavy Rain Strong Winds Lashes Bengaluru

    కాగా, మే 30 వరకు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని బారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని, చల్లని ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 36 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి.

     Heavy rain, strong winds lash Bengaluru city

    ఆదివారం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో నగరవాసులు కొంత ఆనందం వ్యక్తం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో భారీ వర్షం, చల్లని ఈదురుగాలులు నగరవాసికి కొంత ఉపశమనం కలిగించాయనే చెప్పవచ్చు.

    కాగా, వర్షానికి సంబంధించిన వీడియోలను నగరవాసులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తమ అనుభూతులను పంచుకున్నారు. ఇలాంటి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాన్ని తాము ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణ బెంగళూరులో భారీ వర్షం పడిందని, ఈదురుగాలులు వీచాయని మరికొందరు చెప్పుకొచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+