ముంబైలో భారీ వర్షాలు...జలమయమైన రోడ్లు, ఇబ్బంది పడ్డ నగరవాసులు

Recommended Video

    మరో 48 గంటలపాటు ముంబై కి భారీ వర్ష సూచన || Heavy Rainfall In Mumbai For Next 48 Hours : IMD

    ముంబై: మంగళవారం రాత్రి నిద్రపోయి బుధవారం ఉదయం లేవగానే ముంబై నగరవాసులు నడిసముద్రంలో ఉన్నట్లు ఫీలయ్యారు. మంగళవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురవడంతో ముంబై నగరంమంతా నీటితో నిండిపోయింది. ఇదిలా ఉంటే రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంబైలో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయిపోవడంతో పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎక్కడ మ్యాన్‌హోల్‌లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయో అనే భయం వారిలో నెలకొంది.

    ఇదిలా ఉంటే రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ఆఫీసులకు ఇతర పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సియాన్ రైల్వే స్టేషన్‌లో అయితే వర్షపు నీరు రైల్వే ట్రాక్ పై నిలిచిపోయింది. ఇక భారీ వర్షాలకు రహదారి కనిపించకపోవడంతో మూడు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ముంబై, రాయగడ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

    Heavy rains hit Mumbai, Roads waterlogged IMD warns more showers

    ఇక ముంబైకి సమీపంలో తుఫాను డెవలప్ అవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.దీంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ చెప్పింది. ఇక గత రెండు మూడ్రోజులుగా ముంబైలో వర్షాలు కురవలేదు. దీంతో కాస్త ఊపిరి తీసుకున్నారు నగరవాసులు. బుధవారం ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో ముంబై వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.ఈ నెల ప్రారంభంలో ముంబైలో కురిసిన భారీ వర్షాలకు మలాడ్‌లో ఓ గోడ కూలి 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు విమానాలను రద్దు చేశారు అధికారులు మరికొన్నిటిని దారి మళ్లించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+