దంచికొట్టిన భారీ వర్షాలు: ఈ రూట్లల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం

Bengaluru rains: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సిలికాన్ సిటీ బెంగళూరులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారు జామున మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.

అల్పపీడనం ప్రభావంతో కర్ణాటక వ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలు దక్షిణ కన్నడ, చామరాజనగర, ఉడుపితో పాటు మైసూరు, రామనగర, బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

Heavy rains lashed Bengaluru

ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆరంభమైన కుండపోత వర్షం.. 6:30 వరకు ఏకధాటిగా కొనసాగింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడు సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది.

అత్యధికంగా మరసూరు అగ్రహారలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బొమ్మసంద్ర- 105, అనేకల్- 101, బ్యాగడదేనహళ్లి- 97, శాంతిపుర- 86, చంద్రాపుర- 78, బన్నేరుఘట్ట- 74, కొడిగేహళ్లి- 61, విశ్వేశ్వరపుర- 57. విద్యాపీఠ- 56, నాయండనహళ్లి- 55, హగదూరు- 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రాజరాజేశ్వరినగర- 53, చౌడేశ్వరి- 51.50, నాగేనహళ్లి- 50, పులకేశినగర- 49, యలహంక- 48, అరకెరె- 48, దొడ్డనెక్కుండి- 45, హెచ్ఎస్ఆర్ లేఅవుట్- 45 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల వల్ల రోడ్లపై వరదనీరు పోటెత్తడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

నాగవార జంక్షన్- హెబ్బాళ, ఎస్టీమ్ మాల్- హెబ్బాళ ఫ్లైఓవర్, ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే- వీరసంద్ర, బన్నేరుఘట్ట- జయదేవ అండర్ పాస్ టన్నెల్, రోహన్ అగ్రహార- సిల్క్ బోర్డ్, బొమ్మనహళ్లి- సిల్క్ బోర్డ్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలు స్తంభించిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+