కాలనీలో కుప్పకూలిన హెలిక్యాప్టర్ , తప్పిన పెనుప్రమాదం
ముంబాయిలోని ఆరే కాలనీలో హెలిక్యాప్టర్ కూలిపోయింది ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. రాబిన్ సన్ ఎఆర్ 44 రకానికి చెందిన హెలిక్యాప్టర్ సాంకేతిక లోపం కారణంగా కూలిపోయింది.
ముంబాయి;ముంబాయిలో హెలిక్యాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబాయిలోని గోరెగావ్ లోని ఆరే కాలనీలో రాబిన్ సన్ ఆర్ 44 అనే హెలిక్యాప్టర్ ఆదివారం నాడు కుప్పకూలింది. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పింది. జనావాసాల మద్య ఈ హెలిక్యాప్టర్ కూలిపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంబవించేది.
ముంబాయిలోని గోరేగావ్ ఆరేకాలనీలో హెలిక్యాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు హెలిక్యాప్టర్ లో ఐదుగురు ప్రయాణీకులు ఉన్నారు. హెలిక్యాప్టర్ కూలిన వెంటనే మంటలు వ్యాపించాయి. ఘటన స్థలిలో రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు.

1992 లో ఈ హెలిక్యాప్టర్ ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ హెలిక్యాప్టర్ ఆమన్ ఏవియేషన్ సంస్థ వద్ద ఉంది. ఈ హెలిక్యాప్టర్ జూహు ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరింది. అయితే హెలిక్యాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.
గాయపడినవారిని ముంబాయిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది,మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెలిక్యాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications