కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్: ముగ్గురు మృతి
ఇండియన్ కోస్టల్ గార్డ్‌కు చెందిన ఓ హెలికాప్టర్ గుజరాత్ రాష్ట్రంలోని పోర్‌బందర్ తీరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతి చెందారు. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఈ హెలికాప్టర్ కూలిపోయినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు పైలట్స్ ఉన్నట్లు భావిస్తున్నట్లు ఐసీజీ అధికారులు వెల్లడించారు.
ఈ హెలికాప్టర్ ప్రయాణం ప్రారంభం నుంచే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కొద్ది సేపటికే అది కూలిపోయింది. దీనిపై కోస్ట్ గార్డ్ ఇప్పటకికే దర్యాప్తు చేపట్టింది. ఏఎల్‌హెచ్, హెలికాప్టర్లలో కీలకమైన రక్షణ చర్యలకు హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ చర్యలు చేపట్టింది. గత సంవత్సరం కూడా ఈ శ్రేణి హెలికాప్టర్లు ప్రమాదాలకు గురయ్యాయి. వీటిల్లో డిజైన్ సమస్యలు ఉండటంతో చాలా చోట్ల ఉపయోగించడం లేదు.

గత మార్చి 8న భారత ఇండియన్ నేవీకి చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత వీటి వినియగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేశారు. అయితే, కొన్నాళ్లకు వీటి సేవలను పునరుద్ధరించింది.
ఆ తర్వాత కొన్నాళ్లకే మరో హెలికాప్టర్ కూలిపోవడం మరోసారి వీటి వాడకంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సాంకేతిక లోపం తలెత్తడంో జమ్మూకాశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా.. హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. కాగా, ఈ ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్ (29) ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications