సీఎం హెలికాప్టర్ క్రాష్: తృటిలో తప్పిన పెను ముప్పు!.. (వీడియో)

ల్యాండింగ్‌కు అనుకూలంగా లేనప్పటికీ.. పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ మట్టిలో కూరుకుపోయింది. హెలికాప్టర్ రెక్కలు కూడా విరిగిపోవడం గమనార్హం.

లాతూర్: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. మహారాష్ట్రలోని లాతూర్ వద్ద ఆయన హెలికాప్టర్ క్రాష్ అయినట్లుగా తెలుస్తోంది.

ల్యాండింగ్‌కు అనుకూలంగా లేనప్పటికీ.. పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ మట్టిలో కూరుకుపోయింది. హెలికాప్టర్ రెక్కలు కూడా విరిగిపోవడం గమనార్హం. అయితే ఈ ఘటనలో సీఎం ఫడ్నవీస్ సహా మిగతా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

గురువారం ఉదయం టేకాఫ్ అయిన ఫడ్నవీస్ హెలికాప్టర్, సాంకేతిక లోపంతో ఎటు వెళ్లిందన్న సమాచారం కూడా తెలియరాలేదు. లాతూర్ సమీపంలో క్రాష్ ల్యాండ్ అయిన హెలికాప్టర్.. ఒక గోడను ఢీకొట్టినట్లుగా సమాచారం. ఈ ఘటనలో హెలికాప్టర్ వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. ఇదే హెలికాప్టర్ లో 10రోజుల క్రితం కూడా సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.

మహారాష్ట్ర సీఎంకు తెలంగాణ సీఎం పరామర్శ:

హెలికాప్టర్ ప్రమాద ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఫోన్ ద్వారా ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాద ఘటన తెలియగానే కేసీఆర్ ఫడ్నవీస్ కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ప్రమాద ఘటన గురించి ఫడ్నవీస్ కేసీఆర్ కు వివరించారు. పైలట్ సమయస్ఫూర్తిని కేసీఆర్ అభినందించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+