ఆర్టిస్ట్ హేమ హత్య: చాలాసార్లు డబ్బిచ్చానన్న భర్త
ముంబై: ఆర్టిస్ట్ హేమ ఉపాధ్యాయతో తనకు ఎలాంటి వివాదాలు లేవని, ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నానని ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ పోలీసుల విచారణలో చెప్పాడు. తమ మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాలను కూడా పరిష్కరించనున్నట్లు చెప్పాడు.
హేమ ఉపాధ్యాయ, ఆమె న్యాయవాది భంబానీలు ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. గతంలో చింతన్‌తో విభేదాల కారణంగా హేమ విడాకులకు దరఖాస్తు చేసింది. ఈ కేసు నడుస్తుండగానే ఆమె హత్యకు గురయింది. కేసులో కీలక నిందితులను అరెస్టు చేసిన పోలీసులు హేమ భర్త చింతన్‌ను విచారించారు.

విడాకులకు దరఖాస్తు చేసినప్పుడు ఓ ప్లాట్ విషయంలో తమ మధ్య విభేదాలు ఉండేవని, ఈ ప్లాట్ కావాలని హేమ పలుమార్లు అడిగిందని, తాను ఎప్పుడూ తిరస్కరించలేదన్నాడు. ఈ ప్లాట్ అమ్మి డబ్బును చెరిసగం పంచుకుందామని చెప్పానని, నేను ఢిల్లీలో ఉన్నా.. ముంబై వచ్చినప్పుడు హేమ ఇంట్లోనే ఉండేవాడినన్నాడు.
తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని చెప్పాడు. చాలాసార్లు ఆమె డబ్బు అడిగిందని, తాను సాయం చేశానని చెప్పాడు. హేమ అదృశ్యమైన రోజు కూడా నేను రూ.2 లక్షలను భరణం కింద ఇచ్చానని చెప్పాడు. కాగా, ఇటీవల ఆర్టిస్ట్ హేమ, ఆమె లాయర్ మృతి సంచలనం రేపిన విషయం తెలిసిందే.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications