హేమ మాలిని తాగరా, ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు?"
రైతుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా హేమ మాలినిపై మహారాష్ట్ర ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ప్రకటనపై ఆయన ప్రకటన చేశారు.
ముంబై: బిజెపి సభ్యురాలు, నటి హేమ మాలినిపై మహారాష్ట్ర అమరావతి జిల్లా ఇండిపెండెంట్ శాసనసభ్యుడు బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై అంశం విషయంలో చర్చ సందర్భంగా ఆయన హేమ మాలిని పేరును లాగారు.
రైతుల ఆత్మహత్యలకు మద్యం సేవించడం కూడా ఓ కారణమని అధికార పార్టీ సభ్యులు అన్నప్పుడు హేమ మాలిని పేరును ముందుకు తెచ్చారు. "తాగడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రతి రోజూ చాలా మంది సినీ నటులు రోజూ తాగుతారు. హేమ మాలిని తాగరా? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు?" అని ఆయన అన్నారు.

తాను హేమమాలిని పేరును ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించానని ఆయన దక్కన్ క్రానికల్ ప్రతినిధితో అన్నారు. ప్రత్యేక సందర్భంగాలో నాందేడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాను ఆ మాట అన్నట్లు తెలిపారు.
రుణ మాఫీ సందర్భాన్ని పురస్కరించుకుని తాగడం వల్ల కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు అనడాన్ని ప్రస్తావిస్తూ ఆ విధంగా అన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏమీ చేయడానికి కూడా సిద్ధంగా లేదని అన్నారు.
రైతుల ఆత్మహత్యలకు మద్యం సేవించడం కారణమని ఎలా చెబుతారని, నటులు తాగరా, వారు ఆత్మహత్యలు చేసుకున్నారా అని అడుగుతూ తాను హేమ మాలిని పేరును ప్రస్తావించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications