ఆర్టిస్ట్ హేమ హత్య: పోలీసుల అదుపులో నిందితుడు
ముంబై/వారణాసి: ప్రముఖ ఆర్టిస్ట్(చిత్రకారణి) హేమా ఉపాధ్యాయ, ఆమె తరపు న్యాయవాది హత్య హరీష్ భాంబనీ కేసులో పోలీసులు సోమవారం కీలక నిందితున్ని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సాధూ రాజ్‌భర్‌ను ఆ రాష్ట్ర స్పెషల్ పోలీసులు అరెస్టు చేశారు.
గత శుక్రవారం రాజ్‌భర్ తనను కలవాలంటూ హేమాకు ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హేమా భర్త చింతన్ ఉపాధ్యాయ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తన దగ్గర ఉన్నాయంటూ సాధూ రాజ్‌భర్ ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆర్టిస్ట్ హేమా, ఆమె లాయర్ హరీశ్‌ను ముంబైలో అత్యంత దారుణంగా ఎందుకు హత్య చేశారన్న విషయం ఇంకా స్పష్టం కావడం లేదు. అర్థనగ్నంగా ఉన్న హేమా, హరీశ్ మృతదేహాలను ముంబై మురికవాడలో పోలీసులు గుర్తించారు.

హత్య చేసిన దుండగులు వాళ్ల చేతులు, కాళ్లను కూడా కట్టేశారు. కాగా, ఈ కేసులో పోలీసులు సాధూ రాజ్‌భర్‌ను విచారిస్తున్నారు. విచారణలో హత్యకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాగా, 2013లో హేమ తన భర్త చింతన్‌పై కేసు పెట్టింది. మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. అంతేగాక, తన గదిలో అశ్లీల చిత్రాలు గీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో హేమ తరపున న్యాయవాది హరీష్ ప్రాతినిధ్యం వహించాడు. కాగా, హేమా ఉపాధ్యాయ్ భర్త చింతన్ కూడా చిత్రకారుడే.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications