సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారు..!!
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందు కోసం ఈ నెల 26 ముహూర్తం ఖరారు చేసారు. రాంచీలో జరిగే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా, ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు. తాజాగా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమిని ఓడించిన జేఎంఎం - కాంగ్రెస్ కూటమి అధికారం నిలబెట్టుకుంది. మంత్రివర్గ కూర్పు పైన సోరెన్ కసరత్తు చేస్తున్నారు.
జార్ఖండ్ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకున్న హేమంత్ సోరెన్ నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 26న ప్రమాణ స్వీకారానికి ముహూర్తంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి జేఎంఎం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వం లో మంత్రులుగా పని చేసి ఓడిన నలుగురికి తిరిగి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని సోరెన్ నిర్ణయించారు. తాజా ఎన్నికల్లో జేఎంఎం - 34, బీజేపీ - 21, కాంగ్రెస్ - 16, ఆర్జేడీ - 04 సీపీఐ (ఎంఎల్) (ఎల్) - 02, ఏజేఎస్‌యూపీ - 01, ఎల్‌జేపీఆర్‌వీ - 01, జేకేఎల్‌ఎం - 01 జేడీయూ - 01 స్థానం దక్కించుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారు మారు చేస్తూ బీజేపీ కూటమిని జేఎంఎం - కాంగ్రెస్ కూటమి ఓడించి అధికారంలోకి వచ్చింది.

జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్క్ 41 కాగా, జేఎంఎం - కాంగ్రెస్ కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 43 స్థానాల్లో పోటీ చేసిన ఝార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం ఏకంగా 34 చోట్ల విజయం సాధించింది. అటు ఎన్డీఏ కూటమి 24 స్థానాలకే పరిమితం అయింది. 68 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా, 21 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలైన ఎల్‌జేపీ రామ్‌విలాస్ పాసవాన్ పార్టీ, జేడీయూ, ఏజేఎస్‌యూ చెరో స్థానంలో విజయం సాధించాయి. బర్హెట్‌లో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 39 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన భార్య కల్పనా సోరెన్ గండేలో 13 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications