ఓటరు జాబితాలో మీ పేరు మిస్ అయితే ఏం చేయాలో తెలుసా?

న్యూఢిల్లీ: ఓటర్ లిస్ట్‌లో మీ పేరు లేకుంటే ఏం చేయాలి? ఎన్నికల సమయంలో కొందరి పేర్లు కనుమరుగవుతుంటాయి. కొందరికి రిజిస్టర్ ఓటరు కార్డు ఉంటుంది. కానీ ఓటరు లిస్ట్‌లో పేరు ఉండదు. అప్పుడు ఏం చేయాలో తెలుసా?

పలు కారణాల వల్ల ఓటర్ లిస్ట్ నంచి మీ పేరు తొలగించి ఉండవచ్చు. మీ ఇంటి అడ్రస్ మారటం లేక మరో నియోజకవర్గానికి వెళ్లడం తదితర కారణాలతో మీ పేరు ఉండే అవకాశం లేదు. ఈ సమయంలో మీ పేరును తిరిగి ఓటర్ లిస్ట్‌లో జత చేసేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.

Here is what you should do if your name is not on the voters list

ఆన్‌లైన్ పద్ధతి

- www.eci.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. అందులో ఉన్న ఆన్ లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి.
- యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో వెబ్ సైట్‌లోకి వెళ్లండి.
- ఆ తర్వాత మీ ఫోటోను, అందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి. అడ్రస్ ప్రూఫ్‌గా ఉండే డాక్యుమెంటును అప్ లోడ్ చేయండి.
- మీరు డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసేందుకు సమస్యలు ఎదుర్కొంటే ఓ రిక్వెస్ట్‌ను పొందుపర్చండి. నీ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు బూత్ లెవల్ ఆఫీసర్‌ను సంప్రదించండి.

ఆఫ్ లైన్ పద్ధతి

- ఈసీఐ వెబ్ సైట్ నుంచి ఫాం డౌన్ లోడ్ చేసుకోండి. లేదంటే ఈఆర్వో కార్యాలయం నుంచి ఫాం పొందండి.
- ఆ ఫాంను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.
- నియోజకవర్గంలోని ఓటర్ కేంద్రంలో సమాచారం ఇవ్వండి.

అవసరమైన డాక్యుమెంట్లు
- ఫాం పైన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి
- ఏజ్ ప్రూఫ్
- అడ్రస్ ప్రూఫ్ కోసం డాక్యుమెంట్లు..
రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, టెలిఫోన్ బిల్.

మీరు ఇచ్చిన అప్లికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎలా తెలుసుకోవాలి?
EPIC (space స్పేస్ ఇచ్చి) మీ ఓటరు ఐడీ అప్లికేషన్ నెంబర్‌ను 9211728082 కు పంపించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+