మోడీ కాంగ్రెస్‌లో చేరారు... చూస్తే షాక్ అవుతారు
ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌లో చేరారు. ఏంటి షాక్ అవుతున్నారా...బద్దశతృవైన కాంగ్రెస్ పార్టీలో మోడీ చేరడమేంటి అని అనుకుంటున్నారా...? మోడీ అంటే అచ్చం నరేంద్ర మోడీలా ఉండే అభినందన్ పాటక్ అనే వ్యక్తి కాంగ్రెస్‌లో చేరారు. ప్రధాని నరేంద్ర మోడీలా ఉండటమే కాదు ఆయన వ్యవహార శైలి మాటతీరును కూడా అభినందన్ ఒడిసి పట్టుకున్నారు. మోడీ తన ప్రసంగంలో మిత్రో అని ఎలాగైతే సంబోధిస్తారో... అభినందన్ కూడా అదే వాయిస్‌తో మిత్రో అని పిలుస్తారు.

మోడీ స్టైల్‌నే మెయింటెయిన్ చేసే అభినందన్ పటక్
ఇక అభినందన్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అతన్ని చూసినప్పుడల్లా ప్రజలు మోడీ చెప్పినట్లుగా అచ్చేదిన్ ఎప్పుడొస్తాయని అభినందన్‌ను ప్రశ్నించేవారట. దీనికి తన దగ్గర సమాధానం దొరకకపోవడంతో... ఎన్డీఏ నుంచి బయటకొచ్చి గతనెల రాజ్‌బబర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహిస్తూ మోడీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

అచ్చేదిన్ గురించి అడిగినప్పుడు బాధ వేస్తుంది
"నేను మోడీలా ఉండటంతో ప్రజలు నన్ను అచ్చే దిన్ ఎప్పుడొస్తాయని ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా అచ్చేదిన్ వస్తాయని పదే పదే మోడీ తన ప్రసంగాల్లో చెప్పేవారు. కానీ నేటికీ మంచి రోజులు రాలేదు. ప్రజలు తనను అలా అడిగినప్పుడల్లా బాధ వేసేదని అందుకే ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరినట్లు అభినందన్ పటక్ తెలిపారు. " ప్రస్తుతం అభినందన్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్, దంతెవాడ, కొండగావ్, బస్తర్‌లలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అభినందన్‌ను చూసిన ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు.

మోడీలానే మిత్రో అని ప్రసంగం మొదలుపెడుతున్న అభినందన్
ఇక ప్రచారం సందర్భంగా ప్రసంగిస్తున్న అభినందన్ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోడీ స్టైల్‌లోనే మిత్రో అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అంతేకాదు మోడీ ముఖకవలికలనే ప్రదర్శిస్తూ తనలా మిమిక్రీ చేస్తూ తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు అభినందన్. మంచిరోజులు ఎక్కడ అని ప్రశ్నిస్తూ... 15 లక్షల రూపాయలు ప్రతి భారతీయుడి అకౌంట్‌లో వేస్తామని చెప్పి మాటతప్పారని విమర్శలు గుప్పిస్తున్నారు అభినందన్. అచ్చేదిన్ ఇక రావని చెప్పేందుకు తాను వచ్చినట్లు చెప్పారు అభినందన్. ఇప్పటి వరకు తాను బీజేపీకి తప్ప మరో పార్టీకి ప్రచారం చేయలేదని చెప్పిన అభినందన్ తొలిసారిగా తాను బీజేపీయేతర పార్టీకి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications