Hero: మహానటి హీరో ఇంట్లో డ్రైవర్ అనుమానాస్పద మృతి, సల్మాన్ ఇంటిలో పిజ్జా, కోకో కోలాతో పాటు ?
చెన్నై/హైదరాబాద్: బహుబాష నటుడు మమ్ముట్టికి దక్షిణ భారతదేశంలో ఎంతపేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంతో పాటు తమిళ, తెలుగు సినిమాల్లో మమ్ముట్టి నటించారు. మమ్ముట్టి వారుసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ ఆయన తండ్రి మమ్ముట్టి బ్రాండ్ లేకుండా అతనికంటే ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అలాంటి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇంటిలో ఆయన కారు డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

స్టార్ హీరో అయిపోయాడు
మలయాళంలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి బహుబాష నటుడిగా అంతకంటే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మమ్ముట్టి ముద్దల తనయుడు దుల్కర్ సల్మాన్. 2012లో సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో దుల్కర్ సల్మాన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ప్రస్తుతం కొన్ని కమర్షియల్ సినిమాల్లో కూడా దులక్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.

తక్కువ వయసులోనే అవార్డులు
మమ్ముట్టిలాగే ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ మలయాళం కలిపిన తమిళం మాట్లాడతాడు కాబట్టి ఆయనకు తమిళనాడులో చాలా మంది అభిమానులు ఉన్నారు. దుల్కర్ సల్మాన్ వయసు 36 ఏళ్లు. దుల్కర్ సల్మాన్ నాలుగు సార్లు సౌత్ ఇండియన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, కేరళ స్టేట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. మలయాళం, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.

చెన్నైలో దుల్కర్ సల్మాన్ ఇల్లు
తమిళ సినిమాల నటిస్తున్న దుల్కర్ సల్మాన్ చెన్నైలోని రాజా అన్నామలైపురంలోని గ్రీన్‌వేస్ రోడ్‌లో చాలా సంవత్సరాలుగా ఓ ఇంటిలో నివసిస్తున్నారు. చెన్నైలోని వడపళని జవహర్‌లాల్ నెహ్రూ వీధిలో నివాసం ఉంటున్న భాస్కర్ అలియాస్ భాస్కరన్ (51) కొంతకాలంగా దుల్కర్ సల్మాన్ కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

హీరోను ఎయిర్ పోర్టులో డ్రాప్ చెయ్యాలని
బహుబాషా నటుడు దుల్కర్ సల్మాన్ ఉదయం విమానాశ్రయానికి తీసుకెళ్లవలసి వచ్చింది, అందుకే భాస్కరన్ అతని ఇంటికి వెళ్లకుండా హీరో దుల్కర్ సల్మాన్ ఇంటిలోని ఓ రూమ్ లో ఉన్నాడు. రాత్రి ఆన్‌లైన్‌లో భాస్కర్ పిజ్జా, కోకాకోలా ఆర్డర్ చేసినట్లు సమాచారం. తరవాత భాస్కర్ పిజ్జా తిని కోకో కోలా తాగాడని తెలుస్తోంది. దగ్గు ఎక్కువ రావడంతో ఊపిరాడక భాస్కరన్ తెల్లవారుజామున 2. 30 గంటల సమయంలో ఒక్కసారి స్పృహతప్పి పడిపోయాడు. హీరో దుల్కర్ సల్మాన్ ఇంటిలో పని చేస్తున్న శ్రీజిత్ డ్రవైవర్ భాస్కర్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

డ్రైవర్ అనుమానాస్పద మృతి
ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే భాస్కర్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై చెన్నైలోని అభిరాంపురం పోలీసులకు సమాచారం అందించడంతో అభిరామపురం పోలీసులు భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే భాస్కర్ మృతికి గల కారణాలు తెలుస్తాయని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

డ్రైవర్ మొబైల్ సీజ్ ?
పిజ్జా, కోకో కోలా శీతల పానీయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిజ్జా, శీతల పానీయాలతో పాటు భాస్కర్ మద్యం సేవించారా ? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. భాస్కర్ సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన చెన్నై పోలీసులు అందులో కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ భాస్కర్ మృతితో హీరో దుల్కర్ సల్మాన్ తీవ్ర వేదనలో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ నటుడిగానే కాకుండా నేపథ్య గాయకుడిగా, సినీ నిర్మాతగా, పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications