తమిళనాడులో ప్రతి ఇంటర్ స్టూడెంట్ కూ ఓ 'హీరో' సైకిల్, హెల్మెట్: సీఎం విజయ్ హీరోయిజం

తమిళనాడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం అమలు చేయనున్న ఉచిత సైకిళ్ల పంపిణీ పథకంలో ముందడుగు పడింది. 2026-27 విద్యా సంవత్సరానికి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అత్యాధునిక సైకిళ్లను సరఫరా చేసే కాంట్రాక్ట్ ను ప్రముఖ సంస్థ హీరో సైకిల్స్ దక్కించుకుంది. ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అత్యల్ప ధరను కోట్ చేసి, ఎల్1 గా నిలిచింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

దీని కింద మొత్తం 5,32,388 మంది పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా అందజేయనున్నారు ముఖ్యమంత్రి విజయ్. బాలుర సైకిల్ ధరను ఒక్కొక్కటి రూ. 7,235 గా కోట్ చేసిందా సంస్థ. బాలికల సైకిల్ ధరను రూ. 7,476 గా నిర్ణయించింది. బిడ్డింగ్ దాఖలు చేసిన ఇతర కంపెనీలతో పోల్చుకుంటే హీరో సైకిల్స్.. ఎల్1 నిలవడంతో ఆ సంస్థను ఖరారు చేసింది. వీటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మొత్తం రూ. 392 కోట్ల వ్యయం చేయనుంది.

Hero Cycles Becomes L1 Bidder for Tamil Nadu Govt Modern Bicycle Scheme Quoted Prices Total Cost

ఇందులో ప్రభుత్వం ఇప్పటికే రూ. 277 కోట్లను కేటాయించింది గానీ.. వర్క్ ఆర్డర్ ఇంకా జారీ కావాల్సి ఉంది. టెండర్ ఖరారు కావడంతో ఒకట్రెండు రోజుల్లో వర్క్ ఆర్డర్ వెలువడొచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సైకిళ్లను ఐఎస్ 10613:2023 నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా హీరో సైకిల్స్ సంస్థ తయారు చేయాల్సి ఉంటుంది. సైకిల్ ఫ్రేమ్, హ్యాండిల్ బార్, క్యారియర్, ఫోర్క్ నిర్మాణంలో ఈఆర్‌డబ్ల్యూ స్టీల్ పైపులను ఉపయోగించాల్సి ఉంటుంది.

సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న ఎయిర్ లైన్స్
సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తోన్న ఎయిర్ లైన్స్

సైకిల్ విడిభాగాలను వేరే సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని టెండర్ నిబంధనల్లో పేర్కొంది ప్రభుత్వం. వాటన్నింటినీ కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సొంతంగానే తయారు చేయాలని సూచించింది. విద్యార్థుల కోసం లైలాక్ మిస్ట్, ఆర్మీ గ్రీన్ రంగులలో వీటిని ఆకర్షణీయంగా తయారు చేస్తారు.

వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్
వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సైకిళ్లతో పాటు బీఐఎస్ సర్టిఫికేషన్ హెల్మెట్, మంచినీటి బాటిల్ ను ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రమాదాలను నివారించడానికి, నకిలీ ఉత్పత్తులను నిరోధిండానికి తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని లేజర్ టెక్నాలజీ ద్వారా సైకిల్ ఫ్రేమ్‌పై ముద్రిస్తారు. అవి శాశ్వతంగా ఉండిపోతాయి. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4,500 పాఠశాలలకు సైకిళ్ల నిర్వహణ కోసం రెండు టూల్ కిట్లను కూడా ప్రభుత్వం సరఫరా చేయనుంది.

సడన్ గా తమిళనాడు సీఎంఓ లో షర్మిల: విజయ్ తో భేటీ
సడన్ గా తమిళనాడు సీఎంఓ లో షర్మిల: విజయ్ తో భేటీ

పంపిణీ చేసిన 30 రోజుల్లోగా ఏవైనా సాంకేతిక లోపాలు గుర్తిస్తే, సంబంధిత సరఫరాదారుల సర్వీస్ సిబ్బంది వెంటనే ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం కోసం అర్హులైన విద్యార్థుల్లో 2,37,133 మంది బాలురు, 2,95,255 మంది బాలికలు ఉన్నారు. వర్క్ ఆర్డర్ అందిన నాటి నుంచి 150 రోజుల్లోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని నిబంధన ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+