సెంట్రల్ జైల్లో స్టార్ హీరోకు సెక్యూరిటీగా సిన్సియర్ లేడీ ఆఫీసర్స్, మైండ్ బ్లాక్

బెంగళూరు పరప్ప అగ్రహార సెంట్రల్ జైలులో అడ్డంగా దొరికిపోయిన రేణుకాస్వామి హత్యకేసు నిందితుడు, శ్యాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ బళ్లారి సెంట్రల్ జైలులో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈసారి హీరో దర్శన్ పై ఇద్దరు సిన్సియర్ మహిళా అధికారులు నిఘా పెట్టడం విశేషం.
బళ్లారి

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వీజే శోభారాణి, బళ్లారి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ లతా దెబ్బతో సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్ కు ఇబ్బందులు ఎదురౌనాయని తెలిసింది.

Hero Darshan is in the middle of the security of women officers in Bellary Central Jail

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో శ్యాండిల్ వుడ్ ప్రముఖ హీరో దర్శన్, కన్నడ నటి పవిత్ర గౌడతో సహ 17 మంది అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు. ఈ హత్య కేసు విచారణ కోర్టులో విచారణ జరుగుతోంది. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న హీరో దర్శన్ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వానికి కుదిపేసింది.

కోర్టు ఆదేశాలతో శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉమ్మి తస్మియా దర్శన్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. నటుడు దర్శన్ బళ్లారి జైలుకు వెళ్లడంతో జైలు భద్రత, పర్యవేక్షణ, నిర్వహణ మొత్తం మహిళా అధికారులదే అయ్యింది. మహిళా అధికారులే కఠిన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించారని తెలిసింది.

జైళ్ల శాఖ డీజీపీ మాలినీ కృష్ణమూర్తి కూడా మహిళా అధికారి కావడం మరో విశేషం.
కర్ణాటకలో

రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జైళ్ల శాఖకు సంబంధించిన కీలక పోస్టుల్లో మహిళా అధికారులు సత్తా చాటుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులోని చేదు జ్ఞాపకాన్ని చెరిపేసేందుకు ఇక్కడి మహిళా అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ అంశాలన్నింటి కారణంగా కర్ణాటక ప్రభుత్వం, పోలీసు శాఖ ఊపిరి పీల్చుకుందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+