నిరసనకు పిలుపునిచ్చిన హీరో విజయ్.. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ ధర్నా !
దేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహరం సంచలనంగా మారింది. సుదీర్ఘ చర్చల అనంతరం నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ వివాదాస్పద బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు పిలుపునినిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టేందుకు పార్టీ అదిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టగా.. ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించింది. బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా వాడీవేడీ చర్చ నడిచింది. ఈ విషయంలోనే అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి తెర లేపారు. దాదాపు 12 గంటల పాటు సుధీర్ఘ చర్చ జరిగిన తర్వాత బిల్లు ఆమోదం కోసం స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. అనుకూలంగా 282 మంది సభ్యులు ఓటు వేస్తే.. వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. ఈరోజు రాజ్యసభలో బిల్లుపై చర్చ జరుగుతుంది.

ముస్లింల ధార్మిక ప్రయోజనాల కోసం, మతపరమైన ప్రయోజనాల కోసం, దేవుని కోసం భూములను, ఆస్తులను శాశ్వతంగా ఇస్తారు. వక్ఫ్ కు ఇచ్చాక మళ్లీ తిరిగి తీసుకోవడానికి వీళ్లేదు. ప్రస్తుతం ఆర్మీ, రైల్వేల తర్వాత భారీ స్థాయిలో భూములు ఉన్నది వక్ఫ్ బోర్డుకు మాత్రమే. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు వద్ద రూ. 8,70,000 స్థిరాస్థులు, 16,173 చరాస్థులు, 3,56,031 ఎస్టేట్ లు ఉన్నాయి. ఈ ఎస్టేట్లు దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఈ ఆస్తులను పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్రంలో బోర్డులు ఉంటాయి. ఈ బోర్డులన్నీ వక్ఫ్ చట్టం, 1995 కింద పనిచేస్తాయి.
వక్ఫ్ సవరణ బిల్లుకు పేరు మార్చారు. బిల్లులో తీసుకొచ్చిన సవరణల ప్రకారం ఈ బిల్లుకు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్ మెంట్ ఎంపవర్ మెంట్ ఎఫీషియన్సీ అండ్ డెవెలప్ మెంట్ బిల్ గా మార్చారు. ప్రస్తుతం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని.. అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అనేక విషయాలపై ప్రభుత్వానికి నియంత్రణ లభిస్తుందని చెబుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications