విజయ్ కుంభస్థలం కొడతారా లేదా పవన్ మాదిరిగా 10 ఏళ్లు వేచి చూస్తారా..!

తమిళ రాజకీయాల్లో మరో పొలిటికల్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విజయ్ తాను రాజకీయాల్లోకి రాబోతున్నా అంటూ ఏడాది క్రితమే ప్రకటించారు. అంగీకరించిన సినిమాలు ఉండటంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆలస్యం అవుతూ వచ్చింది. విజయ్ నటిస్తోన్న Goat సినిమా షూటింగ్ పూర్తి కావడంతో విజయ్ తన పొలిటికల్ పార్టీకి సంబంధించి గురువారం కీలక ప్రకటన చేశారు. తన పార్టీకి ''తమిళ వెట్రి కజగం'' అని నామాకరణం చేశారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన తమిళ వెట్రి కజగం పార్టీ జెండాను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ.. మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా.. విజయ పతాకమిదే అని స్పష్టం చేశారు. జెండాతో పాటు పార్టీ పేరు మీద ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. ఇక నుంచి తమిళ వెట్రి కజగం పార్టీ జెండా దేశవ్యాప్తంగా ఎగురుతుందని ఇకపై తమిళనాడు గెలుస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, పార్టీ జెండా ఎరుపు, పసుపు రంగులో రూపొందించారు. పతాకం మధ్య భాగంలో జంట ఏనుగులు, ఫ్లవర్స్‌ ఉన్నాయి.

Hero Vijay entry into politics some are comparing him with Pawan Kalyan

హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన్ను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కొందరు పోలుస్తున్నారు. విజయ్ కూడా పవన్ కల్యాణ్ మాదిరిగానే తమిళనాట భారీ ఫాలోయింగ్ ఉంది. విజయ్ కూడా అన్యాయాలపై తనదైనశైలిలో స్పందిస్తుంటారు. పెట్రోల్ రేట్లు పెరుగుతున్న సమయంలో విజయ్ సైకిల్ మీద వెళ్లి మరి ఓటు వేసి వచ్చి తన నిరసన తెలియజేశారు. తన సినిమాల్లో కూడా సమాజానికి ఉపయోగపడే అంశాలను చూపిస్తుంటారాయన. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత కానీ సక్సెస్ కాలేకపోయారు.

Hero Vijay entry into politics some are comparing him with Pawan Kalyan

2014 ఎన్నికల ముందు జనసేన స్థాపించిన పవన్ కల్యాణ్, 2024లో కానీ ఎమ్మెల్యేగా విజయం సాధించలేకపోయారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారాయన. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం మూడు పార్టీలతో కలిసి పోటీ చేస్తే కానీ ఆయనకు ఎమ్మెల్యేగా విజయం దక్కలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాలతో పోలిస్తే తమిళ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ మొదటి నుంచి కూడా సినిమా వారే రాజకీయాలను శాసిస్తున్నారు.ఎంజేఆర్, జయలలిత, కరుణానిధి వీరంతా కూడా సినీ ఇండస్ట్రీ వచ్చి ముఖ్యమంత్రులయ్యారు.

Hero Vijay entry into politics some are comparing him with Pawan Kalyan

జయలలిత, కరుణానిధి ఇద్దరూ చనిపోవడంతో తమిళ రాజకీయాల్లో పెద్దగా మజా కనిపించడం లేదు. కరుణానిధి పార్టీని ఆయన కొడుకు స్టాలిన్ ముందుండి నడిపించడమే కాకుండా డీఎంకేను అధికారంలోకి తీసుకువచ్చారు. మరోవైపు జయలలిత చనిపోవడంతో అన్నాడీఎంకే పార్టీ ప్రతిష్ట పూర్తిగా మసక బారింది. దీంతో తమిళ రాజకీయాల్లో పొలిటికల్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని చెప్పి, విరమించుకున్నారు. కమల్ హాసన్ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఇటువంటి సమయంలో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.

తమిళ రాజకీయాల్లో జయలలిత లేని లోటును విజయ్ పూర్తి చేయగలడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ పార్టీ వల్ల అన్నాడీఎంకే ఓటు బ్యాంకు భారీగా చీలే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. అయితే అది అధికారంలోకి వచ్చేంతా కాకపోవచ్చనే అభిప్రాయం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన పార్టీ విధి విధానాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. విజయ్ ఏజెండా ఏమిటో చెబితే కానీ ఆ పార్టీపై ఓ అవగాహనకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరి ఏపీలో పవన్ మాదిరిగా పార్టీ స్థాపించిన 10 ఏళ్లకు సక్సెస్ అవుతారో లేదా..మొదటిసారే జాక్‌పాట్ కొట్టి సీఎం అవుతారో చూడాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+