సెకండ్ ఇన్నింగ్స్: రాజకీయాల్లోకి నయనతార?

హైదరాబాద్: అందాల తార నయనతార సెకండ్స్ ఇన్నింగ్స్ నిర్ణయమై పోయినట్లు కనిపిస్తోంది. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమె మాట్లాడిన విషయాలు ఆ ప్రచారానికి అవకాశం కల్పించాయి. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

నమిత, ఖుష్బూ తరహాలో ఆమె కూడా రాజకీయాల్లో తన భవిష్యత్తును చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. రాజకీయాలపై తనకు గల అవగాహనపై నయనతార మాట్లాడారు. రాజకీయాల తాజా సమాచారం ఎప్పటికప్పుడు తన వద్ద ఉంటుందని ఆమె చెప్పారు. దీన్ని బట్టి ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Heroine nayanathara may enter politics

ఇటీవల ఆమె తమిళనాట రాజకీయ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రానంటూ తెగేసి చెప్పిన నయనతార రాజకీయ సంబంధమైన కార్యక్రమాలు పాల్గొనడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికార పార్టీ కార్యక్రమాలకు ఆమె తప్పనిసరిగా హాజరవుతున్నట్లు చెబుతున్నారు.

రాజకీయ కార్యక్రమాలకు గ్లామర్‌ దుస్తుల్లో కాకుండా సాదాసీదా దుస్తుల్లో వస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల చెన్నైలో ప్రభుత్వం నిర్వహించిన స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. సొంత సినిమా ప్రమోషన్లకే హాజరుకాని నయనతార ఇలాంటి ఫంక్షన్లకు హాజరుకావడం చాలామందిలో అనుమానాలకు తావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+