జోధ్‌పూర్ కోర్టులో టబు, సోనాలీ బింద్రే (ఫోటోలు)
న్యూఢిల్లీ: బాలీవుడ్ తారలు టబు, సోనాలీ బింద్రే, నీలంతో పాటు మరికొందరు రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యారు. 1998లో జింకలను వేటాడిన కేసులో మంగళవారం కోర్టులో విచారణ చేపట్టారు. జోధ్‌పూర్ కోర్టులో వీరిని ప్రత్యక్ష సాక్షులు ముందు హాజరుపరిచారు.
కృష్ణ జింకలను వేటాడిన బృందంలో సోనాలి బింద్రే, టబు, నీలం కూడా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆరోజు ఏమి జరిగిందంటే.. 1998లో హమ్ సాథ్ సాథ్ హై సిన్మా షూటింగ్ కోసం.. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీఖాన్, టబూ, సోనాలీ బింద్రే రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో జోధ్‌పూర్ సమీపంలోని మథానియా, కంకణిలో షూటింగ్ స్పాట్ కి దగ్గర్లో ఓ కృష్ణజింక తూపాకీ తూటాలకు బలైంది.
దీనికి కారణం సల్మాన్ ఖాన్ అంటూ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సల్మాన్ ఖానే జింకను కాల్చి చంపాడని అభియోగాలు నమోదయ్యాయి. దీంతో నిందితులపై ఐపీసీ సెక్షన్ 149తో పాటు.. సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదయ్యాయి. సల్మాన్‌తోపాటు, నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బింద్రె, టబు, నీలం కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

జోధ్‌పూర్ కోర్టులో టబు, సోనాలీ బింద్రే
1998లో జింకలను వేటాడిన కేసులో మంగళవారం కోర్టులో విచారణలో భాగంగా జోధ్‌పూర్ కోర్టుకు హాజరైన సినీ నటి టబు.

జోధ్‌పూర్ కోర్టులో టబు, సోనాలీ బింద్రే
1998లో జింకలను వేటాడిన కేసులో మంగళవారం కోర్టులో విచారణలో భాగంగా జోధ్‌పూర్ కోర్టుకు హాజరైన సినీ నటి సోనాలీ బింద్రే.

జోధ్‌పూర్ కోర్టులో టబు, సోనాలీ బింద్రే
1998లో జింకలను వేటాడిన కేసులో మంగళవారం కోర్టులో విచారణలో భాగంగా జోధ్‌పూర్ కోర్టుకు హాజరైన సినీ నటి నీలం.

జోధ్‌పూర్ కోర్టులో టబు, సోనాలీ బింద్రే
1998లో జింకలను వేటాడిన కేసులో మంగళవారం కోర్టులో విచారణలో భాగంగా జోధ్‌పూర్ కోర్టుకు హాజరయ్యేందుకు భర్తతో కలిసి వస్తున్న సినీ నటి సోనాలీ బింద్రే.












Click it and Unblock the Notifications