ప్రధాని సీటు చుట్టూ గుమిగూడిన మహిళా ఎంపీలు.. దేశం మొత్తం షాక్!

లోక్‌సభలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్న కొద్ది నిమిషాల ముందే విపక్ష ఎంపీల నిరసనలతో సభ దద్దరిల్లింది. విపక్ష మహిళా ఎంపీలు ఏకంగా ప్రధాని కూర్చునే సీటు వరకు దూసుకువెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది.

ప్రధాని సీటు వద్ద నిరసన.. మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వెల్లడించిన వివరాల ప్రకారం.. విపక్షాలకు చెందిన పలువురు మహిళా ఎంపీలు సభ మధ్యలోకి (వెల్‌లోకి) దూసుకొచ్చి.. నేరుగా ప్రధాని కూర్చునే స్థానం వరకు వెళ్లారు. "ప్రధాని కూర్చునే ప్రదేశం వరకు వారు వెళ్లారు. అక్కడ భారీ హంగామా సృష్టించారు. వారి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ప్రధానిపై దాడి చేస్తారేమో అన్నంత దూకుడుగా ఉన్నారు" అని మనోజ్ తివారీ ఆరోపించారు. ఈ గందరగోళం కారణంగానే ప్రధాని మోదీ సభలోకి ప్రవేశించలేకపోయారని ఆయన పేర్కొన్నారు.

High drama in Lok Sabha Opposition Women MPs Gherao PM Chair Priyanka Gandhi Slams PM Modi

నిశికాంత్ దూబేతో వాగ్వాదం
నిరసన సమయంలో కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి, వర్షా గైక్వాడ్ తదితరులు ట్రెజరీ బెంచీల వైపు దూసుకెళ్లారు. అక్కడ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేతో వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. విపక్ష ఎంపీలు దూసుకురావడంతో బీజేపీ మహిళా ఎంపీలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట లాంటి పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు వారిని వారించినా ఎంపీలు వెనక్కి తగ్గలేదు. చివరకు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా జోక్యం చేసుకుని ఇరుపక్షాలను శాంతింపజేశారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.

ప్రధాని భయపడి రాలేదు: ప్రియాంక గాంధీ
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. విపక్షాల నిరసన చూసి ప్రధాని మోదీ భయపడ్డారని.. అందుకే సభకు రాలేదని ఆమె ఎద్దేవా చేశారు. "ఆయన భయపడి రాలేదు. నిశికాంత్ దూబే, అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు కంటే వేగంగా పారిపోయారు" అని విమర్శించారు.

సమాజ్ వాదీ పార్టీ అభ్యంతరాలు
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ కూల్చివేత, అహల్యాబాయి హోల్కర్ విగ్రహం ధ్వంసం వంటి అంశాలపై ప్రధాని సమాధానం చెబుతారని ఆశించామని, కానీ ఆయన రాకపోవడం దారుణమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+