రూ.9 కోట్లిచ్చి కొడుకును విడిపించుకున్న బిజినెస్‌మెన్!

ఆయన తనయుడు సోహైల్ హింగోరాను అక్టోబర్ 29న డామన్‌లోని ధర్మపుర్ గ్రామంలో కిడ్నాప్ చేశారు. ఇతను నవంబర్ 30 తారీఖున విడుదలయ్యాడు. అయితే ఇందుకు 9 కోట్ల రూపాయలు చెల్లించారట. ఈ కేసును సిఐడి ఎడిజి అభయ్ కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలో విచారణ చేయనున్నారు.
ఈ కేసుకు సంబంధించి గుజరాత్ - బీహార్ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇద్దరిని జార్ఖండ్‌లో, ఒకరిని బీహార్లో అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఓ పోలీసు అధికారి తనయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతని ఇంట్లోనే సోహైల్‌ను బంధించారని ఆరోపణలు ఉన్నాయి.
కాగా, బుధవారం సూరత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనీఫ్ వివరాలు వెల్లడించారు. తన తనయుడి అరెస్టు వెనుక పలువురు ప్రముఖుల హస్తముందని ఆరోపించారు. తన కుమారుడిని బీహార్‌లోని ఓ పోలీసు అధికారి ఇంట్లో బందించారని, ముఠా అడిగిన మొత్తాన్ని చెల్లించేందుకు పాట్నా వెళ్లిన తనను పలుచోట్ల తిప్పారన్నారు.












Click it and Unblock the Notifications