స్టార్ హోటల్లో హై ఫ్రొఫైల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: నటి, మోడల్ అరెస్ట్, బాధిత యువతులకు విముక్తి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓ స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న హైఫొఫైల్ సెక్స్ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. ఓ సినీనటి, మోడల్‌తోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కినెట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చాలా కాలంగా...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పో గోరేగావ్‌లోని ప్లస్ స్టార్ హోటల్లో హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు సమాచారం అందడంతో సదరు హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. చాలా కాలంగా ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారికి గుర్తుతెలియని వ్యక్తి సమాచారం ఇవ్వడంతో.. నిజమేనని తేల్చకున్న తర్వాత డీసీపీ జోన్‌కు సమాచారం ఇచ్చారాయన.

కస్టమర్‌లా వెళ్లిన పోలీసు అధికారి..
ఈ క్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వామి సదరు హోటల్‌పై రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా మొదట ఓ పోలీసు అధికారి మారువేషంలో కస్టమర్‌లా సదరు హోటల్‌కు వెళ్లాడు. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వారిని సంప్రదించగా.. అతడు ఇద్దరు యువతులను తీసుకొని వచ్చాడు.

ఇద్దరు యువతులను కాపాడి.. నటి, మోడల్ అరెస్ట్
వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి, ఆ ఇద్దరు యువతులను పోలీసులు కాపాడారు. ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అమ్మాయిలను బలవంతంగా, మాయమాటల చెప్పి ఈ వ్యభిచార కూపంలోకి నెడుతున్న నటి అమృత ధనోవా(32), , మోడల్ రిచా సింగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరితోపాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఆ యువతుల వివరాలు గోప్యంగా..
వ్యభిచార కూపం నుంచి కాపాడిన ఇద్దరు యువతుల సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. సెక్స్ రాకెట్ నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 370(3), 34, ప్రీవెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ సెక్షన్ 4, 5 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెట్రో నగరాల్లో ఇలాంటి సెక్స్ రాకెట్లు సాధారణమైపోయాయి. ఎలాంటి అనుమానం రాకుండా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రజల అప్రమత్తతోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు వెలుగులోకి వస్తున్నాయి.












Click it and Unblock the Notifications