గోవా సెక్స్ రాకెట్లో బుల్లితెర తారలు, మోడల్స్
పానాజీ: హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను గోవా పోలీసులు ఛేదించారు. ఈ సెక్స్ రాకెట్‌తో పలువురు బుల్లితెర తారలకు, మోడల్స్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మహారాష్ట్ర, గోవాల్లో నిర్వహిస్తున్న ఈ సెక్స్ రాకెట్‌కు సంబంధించి ఓ కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు
విచారణలో సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్న హైప్రొఫైల్ విటులు, తారలు, మోడల్స్ గురించి కీలక సమాచారం సేకరించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తీక్ కశ్యప్ వెల్లడించారు. పానాజీ శివారులోని టోనీ హౌసింగ్ కాలనీలో ఆనంద్ కుమార్ అలియాస్ ఆండీ అనే వ్యక్తిని ఈ సెక్స్‌రాకెట్ కేసులో అరెస్ట్ చేశారు.
ఆనంద్ కుమార్ ఇంటి నుంచి విటులు, మోడల్స్, తారలకు సంబంధించి ఆధారాలు సేకరించినట్లు కశ్యప్ తెలిపారు. అతడి ఇంట్లో దొరికిన ఆధారాల్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించి చాలా వివరాలు ఉన్నట్లు తెలిపారు. అయితే వారి వివరాలు బయటపెట్టడానికి పోలీసులు అంగీకరించలేదు.

ఆనంద్ కుమార్ కింద పనిచేస్తున్న మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పనాజీ సమీపంలోని ఓ ఫ్లాట్ నుంచి ముగ్గురు మహిళలను కాపాడారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గోవాకు, పానాజీకి మధ్య గల రీబందర్ ప్రాంతంలోని ఓ భవనంపై సోదా చేసి పోలీసులు రాకెట్ గుట్టు విప్పారు.
సూత్రధారి ఆనంద్ కుమార్‌తో పాటు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గత నాలుగేళ్లుగా ఈ సెక్స్ రాకెట్ నడుస్తున్నట్లు కశ్యప్ తెలిపారు. తారలను, మోడల్స్‌ను ప్రసిద్ధమైన హోటళ్లకు రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఒక్కో కస్టమర్ నుంచి మోడల్ లేదా తార ఐదు లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు, చాలా మంది విటులు కార్పోరేట్ కంపెనీలకు చెందినవారు లేదా రాజకీయ ప్రముఖులను వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications