Android: హైరిస్క్ అంటూ ఆండ్రాయిడ్ యాప్స్‌పై ఐఆర్‌సీటీసీ హెచ్చరికలు, ఈ జాగ్రత్తలు తీసుకోండి
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) తన వినియోగదారులకు కీలక సూచన చేసింది. ఆండ్రాయిడ్ అప్లికేషన్ తమ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కొంతమంది మోసగాళ్లు భారీ స్థాయిలో ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నారని తెలిపింది. అంతేగాక, సాధారణ పౌరులను మోసపూరిత కార్యకలాపాల్లోకి నెట్టడానికి నకిలీ 'IRCTC రైల్ కనెక్ట్' మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులను పట్టుబట్టే హానికరమైన, నకిలీ మొబైల్ యాప్ ప్రచారం చెలామణిలో ఉందని పేర్కొంది.

అటువంటి నకిలీ మొబైల్ యాప్ స్నాప్‌షాట్ ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడవద్దని.. Google Play Store లేదా Apple App Store నుంచి IRCTC అధికారిక Rail Connect మొబైల్ యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. ఏదైనా సహాయం కావాలంటే, దయచేసి [email protected]కు రాయడం లేదా IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctc.co.inలో ప్రచురించబడిన అధికారిక ఫోన్ నంబర్‌లలో IRCTC కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి అని స్పష్టం చేసింది.
మరోవైపు, ఆండ్రాయిడ్(Android) ఫోన్లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా(CERT-in) కూడా హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవని పేర్కొంది. వీటితో సైబర్ నేరగాళ్లు ఫోన్లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశముందని హెచ్చరించింది.
ఆండ్రాయిడ్ 10, 11, 12, 12ఎల్, 13 వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు CERT-In తమ ప్రకటనలో వెల్లడించింది. ప్రేమ్ వర్క్, ఆండ్రాయిడ్ రన్‌టైమ్, సిస్టమ్ కాంపొనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్స్, కెర్నెల్, ఆర్మ్ కాంపొనెంట్స్, క్వాల్కమ్ క్లోజ్డ్ సోర్స్ కాంపొనెంట్స్‌లో తప్పిదాల కారణంగానే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. వీటిని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మన మొబైల్ ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. డివైజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ అప్‌డేట్స్ చేసుకోవాలని పేర్కొంది.
-
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications