Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8వ తరగతి పాస్ అయ్యారా..? అయితే నెలకు రూ.72,000 జీతం మీదే..!

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో, తాజాగా తమిళనాడు రాష్ట్రం పరిధిలోని హైవేస్ (రహదారుల) డిపార్ట్‌మెంట్‌లో పలు కీలక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 8వ తరగతి చదివిన వారికి కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ గార్డ్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కోయంబత్తూరు, తంజావూరు, వెల్లూరు, కడలూరు, తిరుచ్చి, నాగర్‌కోయిల్ వంటి ప్రధాన జిల్లాలతో సహా మొత్తం 10 జిల్లాల్లో కలిపి 80 ఖాళీలు భర్తీ కానున్నాయి.

High Salary Govt Jobs in Tamil Nadu Highways 8th Pass Eligibility Direct Interview Selection

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం లభించనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ గార్డులకు నెలవారీ జీతం రూ.700 నుంచి రూ.8,100 వరకు ఉంటుంది. ఇక డ్రైవర్ పోస్టుకు జీతం రూ.19,500 నుంచి రూ.71,900 వరకు లభించనుంది.

అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత 8వ తరగతి చదివి ఉండాలి. డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అలాగే హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుకు రెండేళ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 01.07.2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు.అభ్యర్థుల ఎంపిక కేవలం ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ముఖ్య గమనిక:
ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక (Contract Basis) ప్రాతిపదికన జరుగుతాయి. ఇవి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కావు. ఈ పోస్టుల నియామకాన్ని ఎప్పుడైనా రద్దు చేసే అధికారం సూపరింటెండింగ్ ఇంజనీర్‌కు ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా వెబ్‌సైట్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి పోస్ట్ ద్వారా సరైన చిరునామాకు పంపాలి. దరఖాస్తులు సమర్పించడానికి నవంబర్ 20 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+