బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Hijab: యూనివర్శిటీ క్యాంపస్ లో హిజాబ్ లు వేసుకుని నమాజ్ చేసిన విద్యార్థులు, వీడియో లీక్, మరోచోట!

|
Google Oneindia TeluguNews

భోపాల్/బెంగళూరు: కర్ణాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఇదే సమయంలో యూనివర్శిటీ క్యాంపస్ లోని క్లాస్ రూమ్ లో హిజాబ్ లు వేసుకుని నమాజ్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో అది వైరల్ అయ్యింది. యూనివర్శిటీ క్యాంపస్ లోని క్లాస్ రూమ్ లో శుక్రవారం హిజాబ్ లు వేసుకుని నమాజ్ చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు హిందూ సంఘ, సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ వివాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని యూనివర్శిటీ అధికారులు అంటున్నారు.

Illegal affair: భర్తకు విడాకులు, ప్రియుడితో రొమాన్స్, ఏడాది బిడ్డ అడ్డుగా ఉన్నాడని, హాలీవుడ్ స్టైల్లో హత్య!Illegal affair: భర్తకు విడాకులు, ప్రియుడితో రొమాన్స్, ఏడాది బిడ్డ అడ్డుగా ఉన్నాడని, హాలీవుడ్ స్టైల్లో హత్య!

హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు ఆదేశాలు

కర్ణాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

సుప్రీం కోర్టులో పిటిషన్

సుప్రీం కోర్టులో పిటిషన్

హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కొందరు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.

యూనివర్శిటీ క్యాంపస్ లో?

యూనివర్శిటీ క్యాంపస్ లో?

కర్ణాటకలో హిజాబ్ వివాదం సర్దుమనుగుతోంది అనుకుంటున్న సమయంలో మధ్యప్రదేశ్ లో మరోసారి హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ క్యాంపస్ లోని క్లాస్ రూమ్ లో కొందరు ముస్లీం విద్యార్థులు హిజాబ్ లు వేసుకుని నమాజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హిందూ జాగరణ్ మంచ్ ఎంట్రీ

హిందూ జాగరణ్ మంచ్ ఎంట్రీ

క్లాసు రూమ్ లో డోర్ లాక్ చేసుకుని సాటి విద్యార్థులకు ఇబ్బంది కలిగించేలా హిజాబ్ లు వేసుకుని నమాజ్ చేసిన విద్యార్థుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తులు యూనివర్శిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ అడ్మిన్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోసారి యూనివర్శిటీ క్యాంపస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హిందూ జగరణ్ మంచ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు షాక్

అధికారులు షాక్

యూనివర్శిటీ క్యాంపస్ లోని క్లాస్ రూమ్ లో శుక్రవారం హిజాబ్ లు వేసుకుని నమాజ్ చేసిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలు హిందూ సంఘ, సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ వివాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ నీలిమా గుప్తా అంటున్నారు.

విచారణకు ఆదేశించిన వైస్ చాన్స్ లర్

విచారణకు ఆదేశించిన వైస్ చాన్స్ లర్

యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులకు ఎలాటి డ్రెస్ కోడ్ లేదని, అమ్మాయిలు నిండుగా దుస్తులు వేసుకుని రావాలని సూచిస్తామని వైస్ చాన్స్ లర్ నీలిమా గుప్తా అన్నారు. విద్యార్థులు మతపరమైన ప్రార్థనలు వారి ఇళ్లల్లో చేసుకోవాలని, ఇలా అన్ని మతాల విద్యార్థులు ఉండే యూనివర్శిటి క్యాంపస్ లో మతపరమైన ప్రార్థనలు చెయ్యకూడదని, ఈ విషయంపై మూడు రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని యూనివర్శిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ వైస్ చాన్స్ లర్ నీలిమా గుప్తా మీడియాకు చెప్పారు.

English summary
Hijab: A video that shows a Muslim student in hijab offering namaz in a Madya Pradesh university has led to a controversy: Madya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X