Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hijab Row: కాలేజ్ లోకి హిజాబ్ లతో అమ్మాయిలు ఎంట్రీ, గేట్ బయటకు పంపించేశారు, ధర్నా !

బెంగళూరు/ విజయపుర: హిజాబ్ వివాదం కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్బంలోనే మరోసారి ముస్లీం అమ్మాయిలు హిజాబ్ దరించి కాలేజ్ కు వెళ్లి నిరసనలు వ్యక్తం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. హిజాబ్ లు, కాషాయం కండువాలు దరించకూడదని, నుదిటి మీద తిలకం పెట్టుకోకూడదని, మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టకూడదని కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసినా కొందరు ముస్లీం అమ్మాయిలు కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ లు ప్రారంభం అయిన రోజు ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ లు వేసుకుని కొందరు ముస్లీం అమ్మాయిలు బలవంతంగా కాలేజ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అక్కడ ఉన్న మహిళా పోలీసులు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన అమ్మాయిలను అడ్డుకున్నారు. హైకోర్టు మద్యంతర ఆదేశాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, హిజాబ్ లు వేసుకుని లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని కాలేజ్ ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. కాలేజ్ లోని ఒక గదిలో బుర్కాలు, హిజాబ్ లు భద్రపరచడానికి ఏర్పాట్లు చేశామని, అక్కడ మతపరమైన దుస్తులు తీసివేసి క్లాసులకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ ముస్లీం అమ్మాయిలకు మనవి చేశారు. ఇదే సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్ తో కొందరు అమ్మాయిలు వాదనలకు దిగడంతో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తతంగం వీడియోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 విద్యాసంస్థల్లో హిజాబ్ గొడవ

విద్యాసంస్థల్లో హిజాబ్ గొడవ

కర్ణాటకలో హిజాబ్ లు వేసుకుని స్కూల్స్, కాలేజ్ లకు వెళ్లడం వివాదానికి దారితీసింది. హిజాబ్ లు, కాషాయం కండువాలు దరించకూడదని, నుదిటి మీద తిలకం పెట్టుకోకూడదని, మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టకూడదని ఇటీవల కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కొందరు ముస్లీం అమ్మాయిలు కోర్టు ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

 ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న ప్రిన్సిపాల్

ముస్లీం అమ్మాయిలను అడ్డుకున్న ప్రిన్సిపాల్

కాలేజ్ లు ప్రారంభం అయిన ఈ రోజు (బుధవారం) ఉత్తర కర్ణాటకలోని విజయపురంలోని ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ లు వేసుకుని కొందరు ముస్లీం అమ్మాయిలు బలవంతంగా కాలేజ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు అక్కడ ఉన్న మహిళా పోలీసులు హిజాబ్ లు వేసుకుని కాలేజ్ లోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన అమ్మాయిలను అడ్డుకున్నారు.

 హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని మనవి

హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని మనవి

కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, హిజాబ్ లు వేసుకుని లోపలికి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని హిజాబ్ లు వేసుకుని కాలేజ్ దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు ఆ ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. ప్రతిఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాలని, కాలేజ్ దగ్గర శాంతిని కాపాడాలని కాలేజ్ ప్రిన్సిపాల్, స్థానిక పోలీసులు ముస్లీం అమ్మయిలకు మనవి చేశారు.

 టెన్షన్... టెన్షన్

టెన్షన్... టెన్షన్

కాలేజ్ లోని ఒక గదిలో బుర్కాలు, హిజాబ్ లు భద్రపరచడానికి ఏర్పాట్లు చేశామని, అక్కడ మతపరమైన దుస్తులు తీసివేసి క్లాసులకు హాజరుకావాలని కాలేజ్ ప్రిన్సిపాల్ ముస్లీం అమ్మాయిలకు మనవి చేశారు. ఇదే సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్ తో కొందరు అమ్మాయిలు వాదనలకు దిగి ధర్నాలు చెయ్యడంతో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తతంగం వీడియోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ రోజు (బుధవారం) మద్యాహ్నం కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ల విచారణ జరగనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+