Hijab Row: సరస్వతి తల్లికి తేడాలు ఉంటాయా ?, పూజలో బుర్కా వేసుకుంటే?, రాహుల్ గాంధీ ఫైర్!

బెంగళూరు/ న్యూఢిల్లీ: చదువుల తల్లి సరస్వతి దేవి హిందువులు, ముస్లీంలు అని ఎప్పుడు తేడాలు చూపించదని, మనం చూపించే తేడాలు సరస్వతి తల్లి మీద వేస్తున్నామని, భరతమాత ముద్దుబిడ్డలైన అమ్మాయిలను విభజించి వారి హక్కులను మనం దోచుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలను హిజాబ్ ధరించకుండా కాలేజ్ ప్రిన్సిపాల్ అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పబట్టారు.

క్లాస్ రూమ్ లో సరస్వతి పూజ జరిగే సమయంలో ముస్లీం అమ్మాయిలు హిజాబ్ (బుర్కా) వేసుకోకూడదని వీళ్లకు ఎవరు చెప్పారు ? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారతదేశం ముద్దు బిడ్డలైన అమ్మాయిల భవిష్యత్తును మనం దోసుకుంటున్నామని (బీజేపీ నాయకునుల ఉద్దేశించి) రాహుల్ గాంధీ మండిపడ్డారు.

 ప్రభుత్వ కాలేజ్ లో బుర్కాల వివాదం

ప్రభుత్వ కాలేజ్ లో బుర్కాల వివాదం

కర్ణాటకలోని ఉడిపి ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో చదువుతున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పటికే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మమ్మల్ని బుర్కాలు వేసుకుని కాలేజ్ లోకి రాకూడాదని ప్రిన్సిపాల్, కాలేజ్ సిబ్బంది అడ్డుకుంటున్నారని, మా మనోభావాలు దెబ్బతినేలా వీరు ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

ప్రభుత్వానికి నోటీసులు.... చిక్కుల్లో ప్రిన్సిపాల్

ప్రభుత్వానికి నోటీసులు.... చిక్కుల్లో ప్రిన్సిపాల్

ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు బుర్కాలు ( హిజాబ్) వేసుకుని కాలేజ్ లో అడుగు పెట్టకూడదని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఉడిపి ఎమ్మెల్యేకి, ఉడిపి జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉడిపి ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ లో ప్రిన్సిపాల్, ఆ కాలేజ్ అధ్యాపకులు, సిబ్బందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఉడిపి దెబ్బతో రాజకీయ రంగు

ఉడిపి దెబ్బతో రాజకీయ రంగు

ఉడిపి ఎమ్మెల్యే రఘపతి భట్ (బీజేపీ) ప్రభుత్వ కాలేజ్ లో ఎక్కువగా పెత్తనం చేస్తున్నారని, ఆయన రాజకీయ స్వార్థం కోసం విద్యార్థుల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని కొందరు అమ్మాయిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆడినట్లు కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆడుతున్నారని ముస్లీం అమ్మాయిల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ఈ దెబ్బతో హిజాబ్ (బుర్కాలు) వివాదానికి రాజకీయ రంగు అంటుకుంది.

సరస్వతి తల్లికి తేడాలు ఉంటాయా ? రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

సరస్వతి తల్లికి తేడాలు ఉంటాయా ? రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

చదువుల తల్లి సరస్వతి దేవి హిందువులు, ముస్లీంలు అని ఎప్పుడు తేడాలు చూపించదని, మనం చూపించే తేడాలు సరస్వతి తల్లి మీద వేస్తున్నామని, భరతమాత ముద్దుబిడ్డలైన అమ్మాయిలను విభజించి వారి హక్కులను మనం దోచుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేస్తూ శనివారం ట్వీట్ చేశారు.

Recommended Video

    Revanth Reddy : కేసీఆర్ రాజ్యాంగాన్ని కించపరిస్తే సహించేది లేదు | Telangana | Oneindia Telugu
    సరస్వతి పూజకు.... బుర్కాలకు ఏమిటి సంబంధం?

    సరస్వతి పూజకు.... బుర్కాలకు ఏమిటి సంబంధం?

    కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలను హిజాబ్ ధరించకుండా కాలేజ్ ప్రిన్సిపాల్ అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పబట్టారు. క్లాస్ రూమ్ లో సరస్వతి పూజ జరిగే సమయంలో ముస్లీం అమ్మాయిలు బుర్కా వేసుకోకూడదని వీళ్లకు ఎవరు చెప్పారు ? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారతదేశం ముద్దు బిడ్డలైన అమ్మాయిల భవిష్యత్తును మనం దోసుకుంటున్నామని పరోక్షంగా బీజేపీ నాయకునుల ఉద్దేశించి రాహుల్ గాంధీ మండిపడ్డారు. మొత్తం మీద ఉడిపిలో జరుగుతున్న కాలేజ్ అమ్మాయిల బుర్కాల వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+