'హైక్ మెసేంజర్' ఉద్యోగులకు షాక్: లేఆఫ్స్ షురూ, ఎంతమందిని సాగనంపుతారో!
న్యూఢిల్లీ: దేశీ మెసేజింగ్ యాప్ 'హైక్'.. ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 20-25శాతం ఉద్యోగులను సాగనంపేందుకు చర్యలు ప్రారంభించింది. పనితీరును కారణంగా చూపిస్తూ ఉద్యోగులపై వేటు వేస్తోంది. హార్డ్‌వేర్ మేకర్ క్రియో, సోషల్ నెట్‌వర్కింగ్ వెంచర్ ఇన్‌స్టాలైవ్లీల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. ఆ ప్రభావం ఉద్యోగులపై పడిందని చెబుతున్నారు.
తాజా లేఆఫ్స్ తో 75మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. హైక్ మెసేంజర్ అధికార ప్రతినిధి సైతం లేఆఫ్స్ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఎంతమందిపై వేటు వేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. 'గతేడాది జరిపిన కొన్ని కొనుగోళ్ల వలన ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులో బెంగళూరులోనే ఎక్కువశాతం ఉన్నారు. కొన్ని టీమ్స్ ను కలపడం, క్రమబద్దీకరించడం చేస్తున్నాం.' అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

మానవ వనరుల విభాగం, అకౌంటింగ్, ఫైనాన్స్ వంటి వాటిల్లో ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఉండనున్నట్టు సమాచారం. వేటు పడే ఉద్యోగులకు రెండు నెలల శాలరీతో సెవరెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ అందించనుందని తెలుస్తోంది. కాగా, హైక్ గతేడాది కొనుగోలు చేసిన క్రియోలో ప్రస్తుతం 50మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇన్‌స్టాలైవ్లీ ఆపరేట్ చేసే పల్స్ అనే నెట్‌వర్కింగ్ యాప్‌ను కూడా 2017 ఫిబ్రవరిలో హైక్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో 5 నెలల్లోనే కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ చేసింది. డేటా లేకున్నా సరే మెసేజింగ్ రీచార్జ్ చేసుకునే సర్వీసులను ఇది అందిస్తోంది.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications