• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download
LIVE

హిమాచల్ ప్రదేశ్‌లో ముక్కోణపు పోటీ..బీజేపీని కాంగ్రెస్ ఆప్ అడ్డుకోగలవా..?

|
Google Oneindia TeluguNews

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.నవంబర్ 12 శనివారం ఈ రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారమే ప్రచారం ముగిసింది.ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో బిజీగా ఉండటంతో ఆయన స్థానాన్ని ప్రియాంకా భర్తీ చేశారు. ఇక ఆప్ తరపున ఢిల్లీ,పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్,భగవంత్ మన్‌లు ప్రచార బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటి వరకు ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉండగా.. తాజాగా ఆప్ కూడా బరిలో నిలిచింది.దీంతో ముక్కోణపు పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాలు, ఇండిపెండెంట్లు రెండు స్థానాలు, సీపీఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. మొత్తం 68 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌కు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Himachal Pradesh Assembly elections 2022 live updates in telugu:Its a triangular fight in the hill state

Newest First Oldest First
6:16 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్. ఈవీఎంలను సీల్ చేసి జాగ్రత్తగా తరలించేందుకు సిద్ధం చేసిన అధికారులు
4:35 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. తప్పుడు హామీలను ఇచ్చిందంటూ మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా నెరవేర్చలేని వాగ్దానాలు చేసిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధ్వజమెత్తారు.
4:14 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటైన పోలింగ్ కేంద్రం- తశిగంగ్. ఇక్కడ 98.08 శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 52 ఓటర్లు ఉండగా.. 51 ఓట్లు పోల్ అయ్యాయి.
4:05 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
మధ్యాహ్నం 3 గంటల వరకు 55 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.
3:09 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
పూర్తి అవగాహనతో ఓటు వేయండి. రాష్ట్ర స్థితిగతులను సమూలంగా మార్చివేయడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. హిమాచల్ ప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం మీ సహకారం అవసరం - ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా
2:49 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
తాశిగంగ్‌లో కొనసాగుతున్న పోలింగ్. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం మీద అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం కావడం దీని ప్రత్యేకత.
1:52 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
మందకొడిగా సాగుతోన్న పోలింగ్. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 37.19 శాతం వరకు మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.
1:46 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ఇంకా ఊపందుకోని పోలింగ్. చాలాచోట్ల మందకొడిగానే పోలింగ్ సాగుతోంది.
1:30 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ఈ ఎన్నికలతో బీజేపీకి పతనం తప్పదు. మెజారిటీ సీట్లను తాము గెలుచుకోబోతోన్నాం. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తోన్నారు. ఓటింగ్ సరళి తమకు అనుకూలంగా ఉంది. మంచి మెజారిటీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం- కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్.
1:19 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
చంబా జిల్లా పంగీ తెహశీల్ పరిధిలోని ఛసక్ భటోరీ పోలింగ్ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న 82 సంవత్సరాల వయోధిక వృద్ధురాలు.
1:13 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ఎముకలు కొరికే చలిలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తోన్న ఓటర్లు. చంబా జిల్లా పంగీ తెహశీల్ పరిధిలోని ఛసక్ భటోరీ వద్ద కనిపించిన దృశ్యం ఇది.
1:05 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఇక్కడ ఎలాగూ గెలవలేమని కాంగ్రెస్ నేతలకు అర్థమైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక్కడే కాదు గుజరాత్‌లో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.
12:59 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ఈ ఎన్నికల్లో 40 నుంచి 45 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ప్రతిభా సింగ్.
12:54 PM, 12 Nov
ఆరోగ్యం, వాతావరణం సహకరించకపోయినా తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్న వయోధిక వృద్ధులను చూసి యువ ఓటర్లు స్ఫూర్తి పొందాలి - కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
12:46 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
80 సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్న లక్షా 20 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. వారికి సెల్యూట్ చేస్తున్నా- కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.
12:32 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 157 మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో పనిచేసే సిబ్బంది మొత్తం మహిళలే. హమీర్‌పూర్ జిల్లా విమెన్ పోలింగ్ బూత్‌తో క్రెచ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
12:12 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
తన ఓటు హక్కును వినియోగించుకున్న నారో దేవి. ఆమె వయస్సు 105 సంవత్సరాలు. చురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ స్టేషన్ 122లో ఆమె కొద్దిసేపటి కిందటే ఓటు వేశారు.
12:06 PM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ఒపీనియన్ పోల్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ వెల్లడించకూడదని ఆదేశించిన కేంద్రం ఎన్నికల కమిషన్. వాటిపై నిషేధం విధించినట్లు తెలిపింది.
11:48 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
బిలాస్‌పూర్‌లోని విజయ్‌పూర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న భారతీయ జనత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తన భార్య మల్లిక నడ్డాతో కలిసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
11:45 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
మందకొడిగా సాగుతున్న పోలింగ్. ఉదయం 11 గంటల వరకు 17.98 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
11:03 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
అయిదేళ్ల బీజేపీ పాలనలో యువత, ఉద్యోగులు, పేద, మధ్య తరగతి కుటుంబీకులు విసిగి పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగింది. భారీ మెజారిటీతో తాము అధికారంలోకి వస్తాం- కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ.
10:46 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
షిమ్లాలోని లాంగ్‌వుడ్ సైనిక్ రెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆనంద్ శర్మ.
10:35 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
మందకొడిగా సాగుతున్న పోలింగ్. తొలి గంటలో నాలుగు శాతం మాత్రమే ఓటింగ్ నమోదు.
10:25 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
హమీర్‌పూర్ జిల్లాలోని సమీర్‌పూర్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు.
9:58 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
షిమ్లాలోని రామ్‌పూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్.
9:29 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
షిమ్లాలోని పోలింగ్ స్టేషన్ 63/87లో ఓటు వేసిన మంత్రి సురేష్ భరద్వాజ్.
9:12 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
మండీ జిల్లాలోని సెరాజ్‌లో గల 44వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, ఆయన భార్య సాధన, కుమార్తెలు చంద్రిక, ప్రియాంక. ఈ ఎన్నికల్లో తాను భారీ విజయంతో గెలుస్తానని జైరామ్ ఠాకూర్ చెప్పారు.
9:10 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఇప్పుడున్న పరిస్థితిని మార్చడానికి ఇదే సరైన సమయం. ఈ పోలింగ్ కాంగ్రెస్‌కు కాదు.. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల గొంతులను అణచివేసింది- కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్.
8:56 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్న ఓటర్లు.
8:50 AM, 12 Nov
హిమాచల్ ప్రదేశ్
ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్లే ముందు మండీలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్. భార్య సాధన, కుమార్తెలు చంద్రిక, ప్రియాంక ఇందులో పాల్గొన్నారు.
READ MORE

English summary
Himachal Pradesh Assembly elections 2022 live updates in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X