హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల నగరా: షెడ్యూల్ ఖరారు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల తేదీలను ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్‌ 9న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 16న నోటిఫికేషన్‌ వెలువడనుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో 7521 కేంద్రాల్లో పోలింగ్‌ జరగనుంది.

కాగా, డిసెంబర్‌ 18కు ముందే గుజరాత్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు. గుజరాత్‌, హిమాచల్‌లో ఎన్నికల కోడ్‌ను ఇప్పటి నుంచే అమలు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటు వేసేందుకు ఫొటో గుర్తింపుకార్డు తప్పనిసరి చేసింది.

 Himachal Pradesh Assembly polls to be held on November 9

ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్‌ ఎత్తును 30 అంగుళాలకు పెంచుతున్నట్లు పేర్కొంది. అలాగే పైలట్‌ ప్రాతిపదికన నియోజకవర్గానికి ఒక వీవీప్యాట్‌ ఈవీఎం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అలాగే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి రూ.28లక్షల ప్రచార ఖర్చు పరిమితి విధించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Election Commission of India on Thursday said that elections to the 68-seat Himachal Pradesh Assembly will be held on November 9 and counting of votes will be done on December 18 this year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి