వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందీ జాతీయ భాష వివాదం-సుదీప్ కు మద్దతుగా కన్నడ విపక్షాలు-అజయ్ దేవ్ గణ్ కు చీవాట్లు

|
Google Oneindia TeluguNews

హిందీని జాతీయ భాషగా కాదంటూ కన్నడ హీరో సుదీప్ చేసిన వ్యాఖ్యలు, అందుకు కౌంటర్ గా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ చేసిన ట్వీట్లు ఇప్పుడు కన్నడ నాట రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి. సుదీప్ వ్యాఖ్యలకు అజయ్ దేవగణ్ ఇచ్చిన కౌంటర్లపై స్పందిస్తున్న కన్నడ విపక్షాలు.. ఆయనకు భారీ కౌంటర్లు ఇస్తున్నాయి. బీజేపీతో ఆయనకున్న సంబంధాల్ని కూడా తెరపైకి తెస్తున్నాయి.

హిందీ జాతీయ భాషపై ట్వీట్ వార్ నేపథ్యంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి అజయ్ దేవ్ గణ్ ప్రవర్తన హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. అజయ్ దేవగన్ హైపర్ మాత్రమే కాదని, జాతీయ భాషగా హిందీపై అతని అభిప్రాయాలు కూడా ఆయన హాస్యాస్పదమైన ప్రవర్తనకు అద్దం పట్టాయని కుమార స్వామి తెలిపారు.

Hindi national language row: former cm kumaraswamy slams ajay devgn on his tweets

అజయ్ దేవగన్ హిందీలో 'హిందీ ఉంది, ఎల్లప్పుడూ మా మాతృభాష మరియు జాతీయ భాషగా ఉంటుందంటూ' ట్వీట్ చేసిన నేపథ్యంలో కుమార స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కర్ణాటక టాక్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో "హిందీ ఇకపై జాతీయ భాష కాదు" అని వ్యాఖ్యానించడంపై దేవగన్ స్పందించారు.
కిచ్చా సుదీప్‌కు మద్దతుగా, హెచ్‌డి కుమారస్వామి ట్వీట్ చేస్తూ "నటుడు @KicchaSudeep హిందీ జాతీయ భాష కాదని చెప్పడం సరైనది. ఆయన ప్రకటనలో తప్పు వెతకడానికి ఏమీ లేదు. నటుడు @అజయ్‌దేవ్‌గన్ స్వభావరీత్యా హైపర్‌గా ఉండటమే కాకుండా తన హాస్యాస్పదమైన ప్రవర్తనను కూడా చూపిస్తాడంటూ వ్యాఖ్యానించారు.

కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం & మరాఠీ లాగా, హిందీ కూడా భాషలలో ఒకటి. భారతదేశం అనేక భాషల ఉద్యానవనం. బహుళ సంస్కృతుల దేశం. దీనికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయవద్దంటూ జనతాదళ్ (సెక్యులర్) నేత కుమారస్వామి అజయ్ దేవగణ్ కు హితవు పలికారు. కన్నడ సినిమా హిందీ చిత్ర పరిశ్రమను మించిపోతోందని దేవగన్ గ్రహించాలని కేజీఎఫ్ 2 తాజా విజయాన్ని గుర్తుచేశారు. అంతే కాదు కన్నడిగుల ప్రోత్సాహం వల్ల హిందీ సినిమా పెరిగిందన్నారు. దేవగన్‌ తన మొదటి సినిమా 'ఫూల్‌ ఔర్‌ కాంటే' బెంగళూరులో ఏడాది పాటు ఆడిన సంగతి మర్చిపోకూడదన్నారు.

English summary
hindi national language row erupts in karnataka after hero sudeep versus bollywood hero ajay devgn's tweet war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X