‘హిందీ మాట్లాడే యూపీ, బీహార్ వాళ్లు తమిళనాడులో టాయిలెట్స్ కడుగుతున్నారు’: డీఎంకే ఎంపీ
చెన్నై: ఉత్తరాదివాళ్ల గురించి మరో డీఎంకే పార్టీనేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డీఎంకే పార్టీ నేతల వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు, ముఖ్యంగా నితీష్ స్పందించరా? అంటూ బీజేపీ మండిపడింది.
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. యూపీ, బీహార్ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు డీఎంకే పార్టీతోపాటు ఇండియా కూటమి నేతలపై ధ్వజమెత్తారు.

*మరోసారి డివైడ్ & రూల్ కార్డ్ ప్లే చేసే ప్రయత్నం. మొదట రాహుల్ గాంధీ ఉత్తర భారత ఓటర్లను అవమానించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి బీహార్ డీఎన్ఏను దుర్భాషలాడారు. ఇక, డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ "గౌమూత్ర రాష్ట్రాలు" అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దయానిధి మారన్ హిందీ మాట్లాడేవారిని, ఉత్తరాది వారిని అవమానించాడు. హిందువులను/సనాతన్ ధర్మాన్ని అవమానించడం, ఆపై విభజించి రూల్ కార్డ్ ప్లే చేయడం ఇండియా కూటమి డీఎన్ఏగా మారింది' అని షెహజాద్ ఘాటుగా స్పందించారు.
ఇండియా కూటమిలోని నేత, సీఎం నితీష్ కుమార్ వల్లే.. బీహార్ ప్రజలు తమిళనాడు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇండియా కూటమి నేతలు ప్రజల్ని కులం, ప్రాంతం, భాష, మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే నేతల వ్యాఖ్యలపై బీహార్ నేతలు నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ యాదవ్, కాంగ్రెస్, ఎస్పీ అఖిలేష్ యాదవ్ ఇలా జరగనట్లు నటిస్తారా? వారు ఎప్పుడు స్టాండ్ తీసుకుంటారు? అని నిలదీశారు. డీఎంకే నేతలు బీహార్ ప్రజలను అవమానించడం మానేయాలని బీజేపీ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు.
Once again an attempt to play the Divide & Rule card
— Shehzad Jai Hind (@Shehzad_Ind) December 23, 2023
First Rahul Gandhi insulted North Indian voters
Then Revanth Reddy abused Bihar DNA
Then DMK MP Senthil Kumar said “Gaumutra states”
Now Dayanidhi Maran insults Hindi speakers and North
Abusing Hindus / Sanatan, then… https://t.co/tYWnIAsnvK pic.twitter.com/8Krb1KmPEP
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఏమన్నారంటే.?
ఇంగ్లీష్ నేర్చుకున్నవారితో హిందీ మాట్లాడేవారిని పోల్చుతూ.. ఇంగ్లీష్ మాట్లాడేవారు పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ లక్షల సంపాదిస్తుంటే.. హిందీ మాట్లాడే బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్లు తమిళనాడులో టాయ్‌లెట్లు కడుగుతున్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు డీఎంకే ఎంపీ దయానిధి మారన్. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. దేశమంతా ఒక్కటేనని.. ఇతర రాష్ట్రాలను, ప్రజలను గౌరవించాలని సూచించారు. అంతకుముందు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. గోముత్ర రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తోందని వ్యాఖ్యానించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications