ఐసిస్‌లో చేరేందుకు హిందూ యువతి యత్నం!

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాదులతో కలిసిపోయేందుకు ఢిల్లీకి చెందిన ఓ హిందూ యువతి యత్నించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె తండ్రి, మాజీ సైన్యాధికారి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ)ని సంప్రదించారు.

తన కుమార్తె కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆయన ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. ఆస్ట్రేలియాకు వెళ్లి వచ్చినప్పటి నుంచీ ఇస్లామిక్ స్టేట్ రిక్రూటర్లతో కంప్యూటర్ ద్వారా టచ్‌లో ఉన్న విషయాన్ని గమనించిన ఆయన ఎన్ఐఏ అధికారులను సంప్రదించి సహకరించాలని కోరారు.

సిరియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆమె పథకాన్ని పసిగట్టి విఫలం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఈ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. తిరిగి వచ్చాక సిరియా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసిపోయేందుకు ప్రణాళిక వేసుకుంది.

Hindu girl as Isis cadre? Ex-army officer seeks NIA help as daughter aspires to join terror outfit

ఆస్ట్రేలియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి ప్రభావంతో్ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఎన్ఐఏ అధికారుల కౌన్సిలింగ్‌తో సదరు యువతి తన మనసు మార్చుకుందని సమాచారం.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలతో ఇరాక్, సిరియాలో వేలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వేలాది మంది యాజ్దీ యువతులను, బాలికలను అపహరించుకుని పోయి సెక్స్ బానిసలుగా మారుస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+