'ఇంటికెళ్లి.. మగతనానికి పూజలు చేయండి..' : తొగాడియా వివాదస్పద కామెంట్స్
అహ్మదాబాద్ : విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హిందూ పురుషులు లైంగిక సామర్థ్యం గురించి ఆందోళన చెందుతూ ఆయన చేసిన తాజా కామెంట్స్ అందరి నోటా హాట్ టాపిక్ గా మారాయి.
గుజరాత్ లోని జంబూసార్‌లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన తొగాడియా, హిందువులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ పురుషుల్లో లైంగిక సామర్థ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తనను ఆవేదనకు గురి చేస్తోందని చెప్పిన ఆయన దీనికి ఓ పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు.
అయితే పరిష్కారం పేరిట తొగాడియా చేసిన ఆ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హిందూ పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి సలహా ఇస్తూ.. 'ఇంటికెళ్లండి.. మగతనానికి పూజలు నిర్వహించండి..' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకి పెరిగిపోతున్న ముస్లిం జనాభాకి సమానంగా హిందు జనాభా కూడా పెరగాల్సి ఉన్నా..! హిందూ పురుషుల్లో తగ్గిపోతున్న లైంగిక సామర్థ్యం కారణంగా పిల్లల జననాలు కూడా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి కారణం మధ్యపానమే అని చెప్పిన తొగాడియా, మధ్యపానానికి పూర్తిగా దూరమవ్వాలని చెప్పారు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా.. లైంగిక సామర్థ్య పెరుగుదల కోసం తానే స్వయంగా ఓ మందును తయారు చేశానని చెప్పుకొచ్చిన తొగాడియా, రూ.600 విలువ చేసే ఆ మందును రూ.500 లకే అందజేస్తున్నానని అన్నారు. తాను ఇస్తున్న ఆ మందును తీసుకెళ్లి ఇంటికి వెళ్లాక భార్యలకు ఇవ్వాలని, అన్నం తినేటప్పుడు అందులో ఆ మందును కలుపుకుని భోజనం చేస్తే.. లైంగిక సామర్థ్యం పెరిగి సంతానోత్పత్తి పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications