వీడు మొగాడు: ప్రేమ, పెళ్లి కోసం మతం, ధర్మం పక్కన పెట్టాడు, ఏం చేస్తారో చెయ్యండి !

ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు మతం అడ్డురావడంతో పెద్దలను ఎదిరించి ఎమైతే అది కాని అంటూ తన ధర్మాన్ని పక్కనపెట్టిన యువకుడు తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు.

బెంగళూరు: ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన యువకుడికి హ్యాండ్ ఇచ్చి అంతకన్న గొప్పంటి అబ్బాయిని లేదంటే శ్రీమంతుడిని వివాహం చేసుకునే అమ్మాయిల గురించి మనం రోజూ వింటూనే ఉన్నాం.

అయితే ఇక్కడ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు మతం అడ్డురావడంతో పెద్దలను ఎదిరించి ఎమైతే అది కాని అంటూ తన ధర్మాన్ని పక్కనపెట్టిన యువకుడు తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నాలుగేళ్ల ప్రేమకు కేరాఫ్ అడ్రస్ !

నాలుగేళ్ల ప్రేమకు కేరాఫ్ అడ్రస్ !

ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర కు చెందిన హసన్ రహీం ఖాన్, కాళమ్మ నగర్ లో నివాసం ఉంటున్న యశోధ అనే యువతి ప్రేమించుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వీరు ఇటీవల వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రోటీన్ సినిమా స్టోరీ !

రోటీన్ సినిమా స్టోరీ !

యశోధదను వివాహం చేసుకోవడం కుదరదని, వారి మతం వేరు, మనం మతం వేరు అంటూ హసన్ రహీం ఖాన్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అయితే రహీం ఖాన్ మాత్రం తాను యశోధను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు. నీవు ఎలా పెళ్లి చేసుకుంటావో మేమూ చూస్తాం అంటూ రహీం ఖాన్ కుటుంబ సభ్యులు బెదిరించారు.

సినిమా చూపించాడు !

సినిమా చూపించాడు !

యశోధను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రహీం ఖాన్ బుధవారం పెళ్లికి అన్నీ సిద్దం చేసుకున్నాడు. శిరసిలోని శివుడి దేవాలయంలో తన సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో యశోధ మెడలో తాళికట్టి తన అర్థాంగిని చేసుకున్నాడు.

నాకు అవసరం లేదు !

నాకు అవసరం లేదు !

తన ప్రేమకు అడ్డుగా ఉన్న తన మతాన్ని, ధర్మాన్ని రహీం ఖాన్ కాదనుకున్నాడు. ఇంతకాలం రహీం ఖాన్ గా ఉన్న అతను తన పేరును రాహుల్ ఆర్యగా మార్చుకున్నాడు. హిందూ ధర్మం, ఆచారాల ప్రకారం యశోధను వివాహం చేసుకుని ఓ ఇంటి వాడు అయ్యానని అతను స్థానిక మీడియాకు చెప్పాడు.

స్వచ్చమైన ప్రేమకు ఏం అడ్డుకాదు !

స్వచ్చమైన ప్రేమకు ఏం అడ్డుకాదు !

స్వచ్చమైన మా ప్రేమకు అడ్డు అయిన మతం, ధర్మం నాకు అవసరం లేదని, తనను నమ్ముకున్న యశోధకు న్యాయం చెయ్యడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని, నా మీద ఎవ్వరూ ఒత్తిడి చెయ్యలేదని నవ వరుడు మీడియాకు చెప్పారు. వీరి ప్రేమ పెళ్లికి శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తదితరులు అండగా నిలిచారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు దేవాలయం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+