ఉగ్రదాది ఎదుట కల్మా చదివి ప్రాణాలతో బయటపడ్డ హిందూ ప్రొఫెసర్..!

జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై 5 సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ పై రివెంజ్ తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పహల్గాం ఉగ్రదాడిలో కల్మా చదివి ఓ హిందూ ప్రొఫెసర్ చాలా తెలివిగా తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే మీడియాకు వివరించారు. ఆయన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

పహల్గాం ఉగ్రదాడి సమయంలో టెర్రరిస్టులు ఏరికోరి మారణహోమం జరిపారు. కేవలం పురుషులనే హతమార్చారు. అది కూడా హిందువా లేదా అడిగి.. అనుమానం వచ్చినవారి దుస్తులు విప్పి మరీ చంపేశారు. ఉగ్రవాదులు మతం అడిగినప్పుడు ముస్లిం అని చెబితే కల్మా చదవమన్నట్లు వార్తలు వచ్చాయి. అలా ముస్లిం అని చెప్పి.. తెలివిగా కల్మా చదివే గుంపులో చేరి ప్రాణాలతో బయటపడ్డారు ఓ ప్రొఫెసర్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఏం జరిగింది..?

అసోంకు చెందిన దేబాశిష్ భట్టాచార్య.. రాష్ట్రంలోని అసోం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వేసవి ట్రిప్ లో భాగంగా తన కుటుంబంతో కలిసి కాశ్మీర్ లోని పహల్గాం అందాలను చూసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే వాళ్లు పహల్గాంలో సేదతీరుతున్న సమయంలోనే ఉగ్రవాదులు మారణహోమం ప్రారంభించారు. ఒక్కసారిగా ఆ కుటుంబానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ఓ ఉగ్రవాది తన దగ్గరకు వచ్చినప్పుడు కల్మా చదువుతున్న గుంపులో తాను కూడా చేరానని.. అలా కల్మా చదువుతున్నట్లు నటించి తన ప్రాణాలను కాపాడుకున్నానని దేబాశిష్ భట్టాచార్య తెలిపారు.

Hindu Professor Survives Pahalgam Attack by Reciting Kalma

" నేను చెట్టు కింద నా కుటుంబంతో కలిసి నిద్రిస్తున్నా. అప్పుడు కొంత దూరంలో ప్రజలు కల్మా చదవడం నేను గమనించాను. నాకు వారి మాటలు వినిపిస్తున్నాయి. వెంటనే నేను కూడా ఆ గుంపులో చేరి కల్మా చదివాను. అప్పుడు ఓ ఉగ్రవాది నా వద్దకు వచ్చి నా వెనక ఉన్న వ్యక్తి తలపై గన్ తో కాల్చేశాడు. తర్వాత నా దగ్గరకు వచ్చి నువ్ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. నేను బిగ్గరగా కల్మా చదివాను. దాంతో ఆ టెర్రరిస్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే నేను లేచి నా భార్య, కుమారుడి వద్దకు వచ్చి వారిని తీసుకుని పరిగెత్తాను. అలా రెండు గంటలపాటు అడవిలో నడుస్తూ ఉన్నాం. అలా వెళ్లాక చాలా సేపటికి హార్స్ రైడర్ కనిపించాడు. అతని సాయంతో హోటల్ కు వెళ్లిపోయాం" అని దేబాశిష్ భట్టాచార్య జరిగిన ఘటనను వివరించారు.

తాను బతికే ఉన్నానంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం తాము శ్రీనగర్ లోని ఓ హోటల్ లో ఉన్నామని.. త్వరలో అసోం వెళ్తామన్నారు. ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు ప్రధాని మోదీ ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+