వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూంలో ఆ జంట రొమాన్స్, స్థానికుల ఫిర్యాదు: 'యోగి సంస్థ కొట్టలేదు'

లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పదిహేనేళ్ల క్రితం స్థాపించిన హిందూ యువవాహిని సంస్థకు చెందిన వారు బుధవారం మీరట్‌లో ఓ ఇంట్లో యువజంట పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

లక్నో: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పదిహేనేళ్ల క్రితం స్థాపించిన హిందూ యువవాహిని సంస్థకు చెందిన వారు బుధవారం మీరట్‌లో ఓ ఇంట్లో యువజంట పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

స్పందించిన యువ వాహిని సభ్యుడు

స్పందించిన యువ వాహిని సభ్యుడు

దీనిపై యువ వాహిని సంస్థ సభ్యుడు నాగేంద్ర ప్రతాప్ సింగ్ స్పందించారు. తాము తలుపులు తెరిచేటప్పటికి ఆ జంట అభ్యంతరకరంగా కనిపించిందని, ఇలాంటి అద్దె గదుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఈ గదులను పోలీసులు తనిఖీ చేస్తుండాలని డిమాండ్‌ చేశారు.

ఆ జంట రొమాన్స్‌లో ఉండగా..

ఆ జంట రొమాన్స్‌లో ఉండగా..

కాగా, మీరట్‌లోని ఇంట్లో ఆ యువ జంట రొమాన్స్‌లో ఉండగా హిందూ యువవాహిని సభ్యులు ఇంట్లోకి చొరబడి జంటతో అసభ్యంగా మాట్లాడారు.
మీరు ఎక్కడి నుంచి వచ్చారని, ఇక్కడేం చేస్తున్నారని, మీ తండ్రి పేరేమిటని, మీ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల పేర్లు ఏమిటని వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

యువకుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతుండగానే మీకంటే మీ కుటుంబ సభ్యుల పేర్లెందుకు వేరేగా ఉన్నాయని, మతమార్పిడి చేసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ సంఘటన మీరట్‌లోని శాస్త్రినగర్‌లో చోటు చేసుకుంది. అనంతరం స్థానిక హిందూ యువవాహిని సంస్థ సభ్యులు ఆ జంటను పోలీసులకు అప్పగించారు.

యువ వాహిని సభ్యులు ఆ జంటను కొట్టలేదు

యువ వాహిని సభ్యులు ఆ జంటను కొట్టలేదు

హిందూ యువ వాహిని సభ్యులు ఆ జంటను కొట్టలేదని పోలీసులు తెలిపారు. స్థానిక ప్రజలు, యువ వాహిని సభ్యులు ఆ జంటను పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఆ జంట రొమాన్స్‌లో ఉండగా స్థానికులు, యువ వాహిని సభ్యులు పట్టుకున్నారని తెలిపారు. ఆ జంట ముస్లీం జంట అని చెప్పారు.

ఏం జరిగిందంటే..?

ఏం జరిగిందంటే..?

సమాచారం మేరకు ఆ జంటలో వ్యక్తి పేరు వాసిమ్. అతను తన గర్ల్ ఫ్రెండ్‌ను మంగళవారం తన అద్దె గదికి పిలిపించుకున్నాడు. ఆ అద్దె గదిలో అనుచిత కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్థానిక హిందూ వాహిని నేతలు నాగేంద్ర తోమర్, సచిన్‌కు చెప్పారు. దీంతో వాహిని సభ్యులు అక్కడకు చేరుకున్నారు.

ఆ జంట రొమాన్స్‌లో ఉన్నారు. దీంతో స్థానికుల సాయంతో యువ వాహిని సభ్యులు వారిని బయటకు గెంటేశారు. తమకు ఈ విషయాన్ని స్థానిక ప్రజలు చెప్పారని యువ వాహిని సభ్యులు తెలిపారు. తమను మోరల్ పోలీసులుగా కొందరు చెబుతున్నారని, అది సరికాదన్నారు.

స్థానికులు అందించగానే తాము మొదట పోలీసులకు చెప్పామన్నారు. తమ కంటే ముందు పోలీసులే సంఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. పోలీసులు వారిని బయటకు తీసుకు వచ్చారన్నారు. ఇదిలా ఉండగా, వాసిమ్ మీరట్‌లో ఓ హోటల్లో పని చేస్తుంటాడు. అసభ్య ప్రవర్తన కింద అతనిపై కేసు నమోదు చేశారని తెలుస్తోంది. యువతిని మాత్రం విడిచిపెట్టారు.

English summary
Outfit claims the two were in a compromising position when the activists gatecrashed into the residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X