వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక అంబాసిడర్ కారు మనది కాదు: అమ్మేసిన హిందూస్థాన్ మోటార్స్

నిన్న మొన్నటి వరకు భారతదేశపు కారు అంటే అంబాసిడర్ కారే అందరికి గుర్తుకు వస్తుంది. కానీ, హిందూస్థాన్‌ మోటార్స్‌కు చెందిన ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఒక యూరోపియన్‌ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోనుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు భారతదేశపు కారు అంటే అంబాసిడర్ కారే అందరికి గుర్తుకు వస్తుంది. కానీ, హిందూస్థాన్‌ మోటార్స్‌కు చెందిన ఈ బ్రాండ్‌ ఇప్పుడు ఒక యూరోపియన్‌ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోనుంది.

యూరోపియన్‌ ఆటోమొబైల్‌ దిగ్గజమైన ప్యూగోట్‌ ఎస్‌ఏ దీనిని కొనుగోలుచేయనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఇప్పటికే ముగిసింది. అంబాసిడర్‌ ట్రేడ్‌మార్క్‌తో సహా ఇతర హక్కులను రూ.80కోట్లకు విక్రయించినట్లు సమాచారం.

Hindustan Motors sells Ambassador car brand to Peugeot

ఈ విషయాన్ని హిందూస్తాన్‌ మోటార్స్‌ రెగ్యులేటరీకి తెలియజేసింది. తమిళనాడులో ప్యూగోట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. తొలుత ఏటా లక్షవాహనాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని భావిస్తున్నారు.

భారత్‌లో అంబాసిడర్‌ విక్రయాలు పడిపోవడంతో 2014లో తయారీని నిలిపివేశారు. 1980లో ఏటా 24,000 కార్లు అమ్మిన అంబాసిడర్‌ 2000 నాటికి 6,000 మాత్రమే అమ్మగలిగింది. ఈ క్రమంలో 2014లో ఉత్పత్తులను నిలిపివేసింది.

English summary
Ambassador, the iconic Indian car brand that till less than a decade ago carried both the Prime Minister and the common man, is being sold to French carmaker Peugeot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X