INS Nipun: సముద్ర గర్భంలో తిరుగులేని శక్తి! హిందూస్థాన్ షిప్‌యార్డ్ అద్భుత సృష్టి

సముద్ర జలాల్లో భారత్ తన సార్వభౌమాధికారాన్ని చాటుకుంటూ, ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. భారత నావికాదళానికి సముద్ర గర్భంలో అత్యంత కష్టతరమైన పనులను సులువుగా పూర్తిచేసే అమోఘమైన శక్తి లభించబోతోంది. దేశీయంగానే డిజైన్ చేసి రూపుదిద్దిన రెండవ ప్రతిష్టాత్మక డైవింగ్ సపోర్ట్ వెసెల్ (DSV) 'నిపుణ్' ఆగస్టు 31న అధికారికంగా భారత నావికాదళంలోకి ప్రవేశించనుంది. సముద్ర గర్భంలో జరిగే అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్లకు ఇది ఒక ప్రధాన వేదికగా మారనుంది.

విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ సాంకేతికతతో ఈ భారీ నౌకను నిర్మించింది. బ్లూప్రింట్ దశ నుంచి నిర్మాణ పనులు పూర్తిచేసుకుని, నావికాదళానికి అందే వరకు సాగిన 'నిపుణ్' ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేక దృశ్యాలను భారత నావికాదళం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. రక్షణ రంగానికి అవసరమైన నౌకల నిర్మాణంలో భారతదేశం ఎంతటి ఆత్మనిర్భరత సాధించిందో చాటిచెప్పడానికి నిపుణ్ నౌక ఒక ప్రత్యక్ష నిదర్శనమని నావికాదళం కొనియాడింది.

Hindustan Shipyard Built INS Nipun Ready for Commissioning to Boost Navy Underwater Capability

సముద్ర అంతర్భాగంలో రక్షణ చర్యలకు అస్త్రం

ఈ 'నిపుణ్' నౌకను సముద్రంలో మునకలు వేసే డైవర్లకు సపోర్ట్‌గా, నీటి అడుగున రిసెర్చ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా డైవర్లు సురక్షితంగా తమ విధులు నిర్వహించేలా ఇందులో అత్యాధునిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, సముద్రంలో ప్రమాదంలో పడే సబ్‌మెరైన్‌లను కాపాడే 'సబ్‌మెరైన్ రెస్క్యూ ఆపరేషన్స్'లో ఈ నౌక అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది.

అత్యాధునిక సాంకేతికతతో సిద్ధమైన సముద్ర యోధుడు

ఈ నౌకలో నేవిగేషన్, ప్లాట్‌ఫారమ్ మేనేజ్‌మెంట్, సముద్రంలో ఒకే చోట స్థిరంగా నిలబడే 'ప్రిసైజ్ స్టేషన్ కీపింగ్' వంటి హైటెక్ వ్యవస్థలతో పాటు, అత్యవసర వైద్య సదుపాయాలను కూడా అమర్చారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నావికాదళం చేపట్టే సంక్లిష్టమైన అండర్ వాటర్ మిషన్లకు ఇది కొండంత అభయాన్ని ఇవ్వనుంది. ఈ నౌక చేరికతో సముద్ర సరిహద్దులను కాపాడే భారత నావికాదళ సైనిక బలం మరింత రెట్టింపు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+